ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం నెల్లూరుపాలెం సెంటర్లో విషాదం జరిగింది. జిల్లాకు చెందిన సుబ్బులు అనే మహిళ తన ఇద్దరు పిల్లలతో కలిసి.. పెట్రోలు పోసుకుని నిప్పంటించుకుంది. ఈ ఘటనలో తల్లి సుబ్బులు(27), కుమార్తె మధురవాణి (5) మృతి చెందారు.
నిప్పు చూసి భయంతో పారిపోయి వచ్చిన కుమారుడు మహేశ్ ఇచ్చిన సమాచారంతో విషయం వెలుగులోకి వచ్చింది. అతనికి గాయాలయ్యాయి. ఘటనకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
ఇదీ చదవండి: నోములలో విషాదం.. పిడుగుపాటుకు 2 ఎడ్లు మృతి