ETV Bharat / crime

ఒకే రోజు ఐదుగురి ఆత్మహత్య.. ఆ కారణంతోనే.. - తండ్రి కూమారుడు ఆత్మహత్య

Five members suicide ఆంధ్రప్రదేశ్​లోని నెల్లురు జిల్లాలో ఒకే రోజు ఐదుగురు ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర విషాదం నింపింది. ఇందులో ఒకే కుటుంబానికి చెందిన తల్లి, కుమారుడు, కుమార్తె ఉరేసుకుని మరణించగా, మరో ఘటనలో తండ్రి, కుమారుడు బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. వరుస ఆత్మహత్యలతో ప్రశాంతంగా ఉన్న నెల్లూరు ఒక్కసారిగా ఉలిక్కి పడింది.

జిల్లాలో ఒకే రోజు అయిదుగురు ఆత్మహత్య
జిల్లాలో ఒకే రోజు అయిదుగురు ఆత్మహత్య
author img

By

Published : Sep 2, 2022, 6:24 AM IST

Five members suicide: ఆంధ్రప్రదేశ్​లోని నెల్లూరు జిల్లాలో విషాద ఘటనలు చోటు చేసుకున్నాయి. ఒకేరోజు ఐదుగురు బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ రెండు ఘటనలకు కుటుంబ కలహాలే కారణమని తెలుస్తోంది. ఓ ఘటనలో తల్లి, కుమారుడు, కుమార్తె ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడగా.. మరో ఘటనలో తండ్రి, కుమారుడు బావిలో దూకి బలవన్మరణానికి పాల్పడ్డారు. ఒకేరోజు జిల్లాలో ఇలాంటి ఘటనలు జరగడం కలకలం రేపింది.

Mother and childrens suicide: వింజమూరు పట్టణంలోని జై భీమ్​నగర్​లో సాదం గీత అనే వివాహిత తన ఇద్దరు పిల్లలు వెంకట్ (10), చరిష్మా (5)తో కలిసి ఆత్మహత్యకు పాల్పడ్డారు. కుటుంబ కలహాల నేపథ్యంలోనే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు సమాచారం. గీత భర్త వెంకట్రావు సమీపంలోని గ్యాస్​ గోడౌన్​లో గుమస్తాగా పని చేస్తున్నాడు. మధ్యాహ్నం భోజన సమయంలో ఇంటికి వచ్చేసరికి భార్య, ఇద్దరు పిల్లలు ఉరేసుకుని ఉండడాన్ని గమనించాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Father and son suicide: ఇలాంటి ఘటనే నెల్లూరు రూరల్ పరిధిలోని కొత్తూరు అంబాపురం ప్రాంతంలో జరిగింది. బావిలో దూకి తండ్రీకుమారుడు ఆత్మహత్య చేసుకున్నారు. అంబాపురానికి చెందిన రంగస్వామికి తన భార్యతో కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. ఆత్మహత్య చేసుకోవాలనే ఉద్దేశంతో తన ఇద్దరు కొడుకులను తీసుకుని దగ్గరలోని నేల బావి దగ్గరికి వెళ్లగా.. పెద్ద కుమారుడు తప్పించుకుని పారిపోయాడు. రామస్వామి, చిన్న కుమారుడు శివకుమార్ ఇద్దరూ బావిలో దూకారు. పెద్ద కుమారుడు ఈ సమాచారాన్ని స్థానికులకు తెలపగా.. వారు హుటాహుటిన బావి దగ్గరకు వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అప్పటికే రంగస్వామి, శివకుమార్​లు మరణించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నెల్లూరు జీజీహెచ్​కు తరలించారు

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.