Mother, son Suicide: సిద్దిపేట జిల్లా కొండపాక మండలం సిరిసినగండ్ల గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. రెండేళ్ల కుమారుడితో సహా తల్లి ఆత్మహత్య చేసుకుంది. సిరిసినగండ్ల గ్రామానికి చెందిన స్వామి, నవనీత (28) భార్యాభర్తలు. వీరికి రెండేళ్ల కుమారుడు మణిదీప్ ఉన్నాడు. కాగా, భార్యాభర్తల మధ్య గత కొన్ని రోజులుగా చిన్నపాటి గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో నాలుగు రోజుల క్రితం నవనీతను పొలం పనులకు రావాలంటూ స్వామి తీవ్రంగా కొట్టాడు.
దీంతో మనస్తాపానికి గురైన నవనీత.. శనివారం మధ్యాహ్నం తన రెండేళ్ల కుమారుడితో సహా ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకుంది. ఈ ఘటనలో ఇద్దరూ సజీవదహనమయ్యారు. వీరి మృతితో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న సిద్దిపేట మూడో పట్టణ పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి:
Adilabad Accident Today: రెండు ద్విచక్రవాహనాలు ఢీ.. ముగ్గురు దుర్మరణం