చెడు అలవాట్లు చేసుకుని తిరుగుతున్నాడని కొడుకు బుద్ధి మార్చేందుకు తల్లి దారుణంగా హింసించిన ఘటన రంగారెడ్డి జిల్లా గంధంగూడలో చోటుచేసుకుంది. కొడుకుని బ్లేడ్‌తో తొడలపై విచక్షణారహితంగా కోసి గాయపరిచింది. కుర్రాడి అరుపులతో చుట్టుపక్కల వారు ఇంటికి వచ్చి అబ్బాయిని కాపాడారు.
ఈ విషయాన్ని నార్సింగి పోలీసులకు సమాచారం అందించి కుర్రాడిని ఆస్పత్రికి తరలించారు. చిన్నప్పటి నుంచి చెడు అలవాట్లకు గురవుతున్నాడని... అందుకే ఇలా చేయాల్సి వచ్చిందని తల్లి చంద్రకళ ఆవేదన వ్యక్తం చేశారు. కుమారుడిని గాడిన పెట్టేందుకే గాయపర్చినట్లు చెప్పుకొచ్చింది.
ఇదీ చూడండి: ఔటర్ రింగ్‌రోడ్‌పై ప్రమాదం.. 25 మందికి గాయాలు