ETV Bharat / crime

పిల్లలతో సహా కుటుంబం ఆత్మహత్యాయత్నం.. బాబాయ్​ పరిస్థితి విషమం - కాగజ్​నగర్

భర్త చనిపోయాక... ముగ్గురు పిల్లలు, మరిదితో కలిసి జీవిస్తోంది. కొంత కాలంగా మరిదితో మనస్పర్ధలు వచ్చి తరచూ కలహాలు జరుగుతున్నాయి. వీటన్నింటికీ పరిష్కారం మరణమే అని నిశ్చయించుకున్నారు. పిల్లలతో కలిసి బాధితురాలు, ఆమె మరిది... విషం తాగి ఆత్మహత్యకు యత్నించారు. అయితే...

mother and uncle attempted suicide with three children in kagaznagar

author img

By

Published : Apr 30, 2021, 5:03 PM IST

కుటుంబ కలహాలతో మనస్తాపానికి గురై పిల్లలతో సహా ఓ కుటుంబం ఆత్మహత్యకు యత్నించిన ఘటన కుమురం భీం ఆసిఫాబాద్​ జిల్లా కాగజ్​నగర్ మండలంలో చోటు చేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు పిల్లలు, తల్లి క్షేమంగా ఉండగా.. బాధితురాలి మరిది పరిస్థితి విషమంగా ఉంది. మండలంలోని నజృల్​నగర్ పంచాయతీకి చెందిన సాధన సన భర్త మూడేళ్ళ క్రితం మరణించాడు. సాధన సనకు ముగ్గురు పిల్లలు సంజ సన, సుమన్ సన, సందీప్ సన.

గత కొంత కాలంగా సాధన... తన మరిది పవిత్ర సనతో కలిసి ఉంటుంది. కొన్ని రోజులుగా సాధనకు మరిదికి మధ్య మనస్పర్ధలు ఏర్పడి... కలహాలు చోటుచేసుకున్నాయి. ఈ గొడవలకు మరణమే శరణ్యమనుకున్నారు. ఆత్మహత్య చేసుకునేందుకు నిర్ణయించుకున్నారు. గురువారం రాత్రి భోజన సమయంలో పెరుగులో విషం కలిపి... పిల్లలకు తాగించి తాము కుడా సేవించారు. కుటుంబసభ్యులంతా అపస్మారక స్థితిలోకి చేరుకోగా... స్థానికులు గమనించి ఆసుపత్రికి తరలించారు. సరైన సమయంలో స్పందించటం వల్ల పిల్లలు, తల్లి... ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డారు. పవిత్ర సన పరిస్థితి మాత్రం విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు.

ఇదీ చూడండి: కరోనాపై భయాలొద్దు.. ఇవి తెలుసుకోండి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.