Mother and Son suicide attempt: ఇంటి పట్టా విషయంలో వైకాపా ఎమ్మెల్సీ ఇక్బాల్, హిందూపురం మున్సిపల్ ఛైర్‌పర్సన్, కమిషనర్ వేధిస్తున్నారంటూ ఏపీలో తల్లీకొడుకులు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. హిందూపురం డీబీ కాలనీలో 1992లో ప్రభుత్వం మంజూరు చేసిన స్థలంలో తాత్కాలిక షెడ్డు నిర్మించుకుంటే.. మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు వేధిస్తున్నారని బాధిత కుటుంబం వాపోయింది.
బాధిత కుటుంబ యజమాని మున్సిపల్ కార్యాలయంలో కాంట్రాక్టు ఉద్యోగిగా పనిచేస్తున్నారు. ఇంటి స్థలం పేరిట ఉద్యోగాన్ని ఊడగొడతామని భయపెడుతున్నారంటూ కాంట్రాక్టు ఉద్యోగి భార్య, కుమారుడు పురుగుల మందు తాగారు. వారిని హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. వారి పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు తరలించారు.
ఇవీ చూడండి: