Mother and son died in Hanamkonda district: కుటుంబ కలహాలతో ఓ తల్లి తన ఇద్దరు కుమారులతో సహా బావిలో దూకి బలవన్మరణానికి యత్నించింది. ఈ ఘనలో బావిలో దూకిన తల్లితో పాటు చిన్న కుమారుడు మృతి చెందగా.. పెద్ద కుమారుడు కేకలు వేయడంతో చుట్టుపక్కల వాళ్లు గమనించి పెద్ద కుమారుని కాపాడారు. ఇందుకు సంబంధించిన వివరాలు స్థానికుల కథనం ప్రకారం.. హనుమకొండ జిల్లా నడికూడా మండలం కంటాత్మకూర్ గ్రామానికి చెందిన మామిడి కావ్య కుమారస్వామి దంపతులకు ఇద్దరు కుమారులు.
పెద్ద కుమారుడు విద్యాధర్, చిన్న కుమారుడు శశిధర్. కుటుంబ కలహాల నేపథ్యంలో ఇద్దరు పిల్లలతో సహా తల్లి కావ్య స్థానిక వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. తల్లితో చిన్న కుమారుడు శశిధర్ మృతి చెందారు. బావిలో ఉన్న పెద్ద కుమారుడు విద్యాధర్ కేకలు వేయడంతో స్థానికులు కాపాడారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్ట్మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు మృతి చెందడంతోగ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
ఇవీ చదవండి:
జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు బోల్తా.. ముగ్గురి పరిస్థితి విషమం, 15 మందికి గాయాలు
పెళ్లి చేసుకుంటానని మోసం చేసిన బాబా.. పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు
ఫోన్లో మాట్లాడుతున్న కూతురు.. అనుమానంతో మేడ పైనుంచి తోసేసిన తండ్రి
100 కిలోల బంగారం, వెండి నగలు చోరీ.. షట్టర్ ధ్వంసం చేసి మరీ..