ETV Bharat / crime

Jubilee Hills Gang Rape Case: ఇన్నోవాలో వీర్య నమూనాలు.. అతడ్ని ఏ6గా చేర్చే అవకాశం! - Gang Rape on Girl at jubileehills

జూబ్లీహిల్స్‌ అత్యాచార ఘటనలో వెలుగులోకి మరిన్ని వివరాలు

author img

By

Published : Jun 5, 2022, 11:24 AM IST

Updated : Jun 5, 2022, 10:16 PM IST

11:22 June 05

జూబ్లీహిల్స్‌ అత్యాచార ఘటనలో వెలుగులోకి కీలక ఆధారాలు

Jubilee Hills Gang Rape Case: జూబ్లీహిల్స్‌లో 17 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం కేసు దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు. కేసులో ప్రజాప్రతినిధుల కుమారులు నిందితులుగా ఉండటం వల్ల కేసును నీరుగారుస్తున్నారంటూ విపక్షాలు ఆరోపిస్తుండటంతో.. దర్యాప్తును పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇప్పటికే నలుగురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్​కు పంపించిన పోలీసులు.. మరో నిందితుడు ఉమర్​ఖాన్​ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కోర్టు ఎదుట హాజరుపరిచిన అనంతరం రిమాండ్​కు తరలించనున్నారు. మరోవైపు ఈ కేసు దర్యాప్తు అధికారిగా బంజారాహిల్స్‌ ఏసీపీ సుదర్శన్‌ను నియమించారు.

వీర్యనమూనాల సేకరణ: ఈ కేసులో కీలకంగా మారిన ఇన్నోవా, బెంజి​ కార్లను పోలీసులు ఇప్పటికే స్వాధీనం చేసుకోగా.. రెండు కార్లను క్లూస్‌ టీమ్‌తో పాటు, ఫోరెన్సిక్‌ నిపుణులు క్షుణ్ణంగా పరిశీలించారు. బెంజి కారులో బాలికకు సంబంధించిన కొన్ని వస్తువులు లభ్యమయ్యాయి. బాలిక చెవి కమ్మ, వెంట్రుకలు, చెప్పును క్లూస్‌ టీమ్‌ సేకరించింది. ఇన్నోవా కారులోనూ బాలిక వెంట్రుకలు దొరకగా వాటితో పాటు.. నిందితుల వీర్య నమూనాలను కూడా ఫోరెన్సిక్‌ బృందం గుర్తించింది. వీర్య నమూనాలు, బాలిక వెంట్రుకలు ఎఫ్ఎస్ఎల్‌కు పోలీసులు పంపించారు.

మరోసారి స్టేట్​మెంట్ రికార్డ్: ఈ ఘటన గత నెల 28న జరిగితే పోలీసులకు బాధితురాలి తండ్రి 31వ తేదీన ఫిర్యాదు చేశారు. అదే రోజు పోక్సో కేసు నమోదు చేశారు. మరుసటి రోజు బెంజి కారును స్వాధీనం చేసుకున్నారు. ఇన్నోవా కారు గురించి రెండు మూడు రోజులు పట్టించుకోలేదు. ఇన్నోవా కారును ఘటన జరిగిన ఐదు రోజుల తర్వాత నిన్న సాయంత్రం మొయినాబాద్‌లో స్వాధీనం చేసుకున్నారు. ఇన్నోవా కారులోని ఆనవాళ్లు, ఆధారాలు చెరిపివేసే క్రమంలోనే నిందితులు.. వాహనం చిక్కకుండా మొయినాబాద్‌లోని ఓ రాజకీయనేత ఫామ్‌హౌస్‌ వెనుక దాచేశారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కారుపై ఉన్న ప్రభుత్వ స్టిక్కర్‌ కనిపిపించకుండా, టీఆర్‌ నంబర్‌ కూడా గుర్తుపట్టకుండా చేశారు. మరోవైపు ఘటన తర్వాత షాక్‌కు గురైన బాలిక పూర్తిగా కోలుకోవడంతో పోలీసులు మరోసారి ఆమె స్టేట్‌మెంట్‌ రికార్డు చేయనున్నారు.

ఇంట్లో దిగబెడతామని చెప్పి: జూబ్లీహిల్స్‌లోని అమ్నీషియా పబ్‌కు వచ్చిన బాలికను ఇంటి వద్ద దిగబెడతామంటూ ప్రభుత్వ సంస్థ ఛైర్మన్‌ కుమారుడు, ఎమ్మెల్యే కుమారుడు బెంజి కారులో ఎక్కించుకున్నారు. అందులో పబ్‌ నుంచి బంజారాహిల్స్‌కు వెళ్తున్నప్పుడే బాలికపై అత్యాచారయత్నం చేసినట్టు పోలీసులు ప్రాథమిక ఆధారాలు సేకరించారు. బంజారాహిల్స్‌ రోడ్‌ నం.14లోని కాన్సు బేకరీ వద్ద కొద్దిసేపు ఆగారు. అక్కడికి ఇన్నోవా కారును డ్రైవర్‌ తీసుకురాగా.. ప్రభుత్వ సంస్థ ఛైర్మన్‌ కుమారుడు ఇప్పుడే వస్తామంటూ వేచి ఉండాలని డ్రైవర్‌కు చెప్పి అతడిని వదిలి వెళ్లినట్లు సీసీఫుటేజీల్లో కన్పించింది. సాదుద్దీన్‌ మాలిక్‌ (18), అమేర్‌ ఖాన్‌ (18)లతో పాటు ప్రభుత్వ సంస్థ ఛైర్మన్‌ కుమారుడు (16), సంగారెడ్డి జిల్లాకు చెందిన అధికార పార్టీ నేత కుమారుడు (16), బల్దియా కార్పొరేటర్‌ కుమారుడు (16) కలిసి బాలికను బెదిరించి ఆమెను బెంజి కారు నుంచి ఇన్నోవా వాహనంలో ఎక్కించి తీసుకెళ్లారు. ఆ సమయంలో ఇన్నోవాలో ఎమ్మెల్యే కుమారుడు (17) సైతం ఉన్నాడు. అతడు కొద్ది నిమిషాల్లోనే కారు దిగి బేకరీ వైపు వెళ్లాడని పోలీసులు వెల్లడించారు. సామాజిక మాధ్యమాల్లో తాజాగా హల్‌చల్‌ అయిన వీడియో నేపథ్యంలో మరోసారి బాధితురాలి వాంగ్మూలం తీసుకోనున్న పోలీసులు.. అతడిని ఏ6 నిందితుడిగా చేర్చే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు.

ఇవీ చూడండి..

Last Updated : Jun 5, 2022, 10:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.