ETV Bharat / crime

'గృహ రుణాలు ఇప్పిస్తామని... డబ్బులు తీసుకుని' - గృహ రుణాలు

బ్యాంక్​ ఉద్యోగినని... గృహరుణాలు ఇప్పిస్తానని... ఓ వ్యక్తి డబ్బులు వసూలు చేసిన ఘటన కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. ఈ ఘటనపై బాధితులు పోలీసులను ఆశ్రయించారు. తమకు న్యాయం చేయాలంటూ గోడు వెల్లబోసుకున్నారు.

money cheating the name of house loans at kamareddy
'గృహ రుణాలు ఇప్పిస్తామని... డబ్బులు తీసుకుని'
author img

By

Published : Mar 14, 2021, 4:45 PM IST

కామారెడ్డి జిల్లా లింగంపేట మండల కేంద్రానికి చెందిన మన్నే రాజు ఇండోసెండ్ బ్యాంక్ ఉద్యోగినంటూ పలువురిని మోసం చేశాడు. ఇంటి రుణాలు ఇప్పిస్తానని పలువురిని నమ్మించి... వారి నుంచి డబ్బులు వసూలు చేశాడు. అతని మాటలు నమ్మిన సంతోష్ అనే వ్యక్తి... అతనితో పాటు మరో నలుగురు ఒక్కొక్కరు 23,300 చొప్పున రాజుకు అందించారు.

డబ్బులు, ఇంటి కాగితాలు ఇచ్చి నెలలు గడుస్తున్నా... రుణం మంజూరు కాకపోవడంతో రాజును గట్టిగా నిలదీశారు. ముందు డబ్బు ఇస్తామని హామీ ఇచ్చి.. అనంతరం డబ్బులు ఇవ్వలేదని ఎదురుతిరిగాడని బాధితులు పేర్కొన్నారు. డబ్బులు కోసం వేధిస్తే అందరి పేర్లు రాసి ఆత్మహత్య చేసుకుంటామని రాజు భార్య సుమలత బెదిరించిందని వాపోయారు.

ఈ నేపథ్యంలో బాధితులు కామారెడ్డి పట్టణ పోలీసు స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి ఇంట్లో సోదాలు నిర్వహించగా సుమలత ఎలుకలమందు తాగి ఆత్మహత్యాయత్నం చేసిందని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఆమె ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతోందని వెల్లడించారు. బ్యాంక్ రుణాల పేరుతో మోసాలకు పాల్పడుతున్న ఇలాంటి వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు.

ఇదీ చూడండి: 'నేను కేసీఆర్​ను కలవలేదు... తప్పుడు ప్రచారమన్న కోదండరాం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.