Chilakalaguda mobile theft case:సెల్‌ఫోన్ దొంగిలించిన కేసులో ఓ యువకుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తే అదనంగా 12 కేసులు వెలుగులోకి వచ్చాయి. హైదరాబాద్‌లోని లంగర్‌హౌస్ ఇందిరానగర్‌కు చెందిన ఎండీ షాబాజ్ అహ్మద్ అలియాస్ హైదర్(21) ప్లంబర్‌గా పని చేస్తుంటాడు. సెల్‌ఫోన్ల చోరీకి అలవాటు పడ్డాడు. ఈనెల 10న చిలకలగూడ రైల్వేకాలనీకి చెందిన అభిషేక్‌పాండే సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ వెళ్తుండగా.. ఎల్లమ్మ టెంపుల్ వద్ద వెనుక నుంచి నంబరులేని ద్విచక్ర వాహనంపై వచ్చిన షాబాజ్ ఆ ఫోన్‌ను ఎత్తుకొని వెళ్లిపోయాడు.
అభిషేక్‌పాండే అతని వెంటపడి పరిగెత్తినా దొరక్కపోవడంతో పోలీసులకు ఫిర్యాదుచేశాడు. ఆదివారం ఉదయం చిలకలగూడలో అనుమానాస్పద స్థితిలో తిరుగుతున్న షాబాజ్‌ను అదుపులోకి తీసుకున్నారు. సెల్‌ఫోన్ దొంగతనాన్ని ఒప్పుకోవడంతోపాటు నగరంలోని పలు పోలీస్‌స్టేషన్లలో 12 సెల్‌ఫోన్లను కాజేసినట్లు ఒప్పుకున్నాడని ఇన్‌స్పెక్టర్ నరేశ్ తెలిపారు. నిందితుడి నుంచి రెండు సెల్‌ఫోన్లు, ఒక ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు.
ఇదీ చదవండి: Man Hit by Train Mahabubnagar : పాటలు వింటూ రైలు పట్టాలపైకి.. రైలు ఢీకొని వ్యక్తి మృతి