Selfie Suicide: హైదరాబాద్ చైతన్యపురి పోలీస్స్టేషన్ పరిధిలో విషాదం చోటుచేసుకుంది. రాజేందర్ రెడ్డి అనే మొబైల్ షాప్ యజమాని సెల్ఫీ వీడియో తీసుకుంటూ బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మొబైల్ దుకాణంపై ఆధారపడి జీవిస్తున్న తనను ఉన్నపళంగా షాపు ఖాళీ చేయాలంటూ యాజమాని ఒత్తిడి చేయడంతోనే చనిపోతున్నట్లు సెల్పీ వీడియోలో పేర్కొన్నాడు.
అధిక అద్దెకు ఆశపడిన యాజమాని మొబైల్ దుకాణాన్ని బలవంతంగా ఖాళీ చేయించి మద్యం దుకాణానికి కిరాయికి ఇచ్చాడని రాజేందర్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశాడు. తాను నిర్వహించిన దుకాణంలోని ఫర్నిచర్‌కు డబ్బుతో పాటు ఇచ్చిన అడ్వాన్స్ కూడా తిరిగి చెల్లించలేదని వాపోయాడు. తన చావుకు దుకాణ యాజమానే కారణమని వీడియోలో తెెలిపాడు. తన కుటుంబానికి 10 లక్షల పరిహారం చెల్లించాలని కోరాడు.
రాజేందర్ భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన భర్త మరణానికి కారణమైన వారిని కఠినంగా శిక్షించి.. న్యాయం చేయాలని డిమాండ్ చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
ఇదీ చూడండి: