మేడ్చల్ జిల్లా మల్కాజిగిరి మౌలాలీలో రెండు రోజుల క్రితం అదృశ్యమైన మహమ్మద్ ముఖ్రం(25) హత్యకు గురయ్యాడు. బంధువుల ఇంట్లో జరిగిన ఓ శుభకార్యానికి తల్లి కుర్షిద్ బేగంతో కలిసి హాజరయ్యాడు. కార్యక్రమం జరుగుతున్న చోట తల్లిని వదిలి తన ద్విచక్ర వాహనంలో పెట్రోల్ కొట్టించుకునేందుకు బంక్‌కు వెళ్తున్నానని వెళ్లిన ముఖ్రం తిరిగి రాలేదు.
కుమారుడు అదృశ్యమయ్యాడని తల్లి కుర్షిద్బేగం మల్కాజిగిరి పోలీసులకు ఫిర్యాదు చేసింది. మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకుని దర్యాప్తు చేయగా తన బంధువుల ఇంట్లో హత్యకు గురయ్యాడని సమాచారం అందింది. హత్యకు కారణం తనబంధువర్గంలోని ఓ మహిళతో వివాహేతర సంబంధం కొనసాగించటమేనని మల్కాజిగిరి పోలీసులు అనుమానిస్తున్నారు.
ఇదీ చదవండి: కాసేపట్లో పెళ్లి.. ఇంతలో వరుడి ఆత్మహత్య