ETV Bharat / crime

Farmers Suicide due to crop loss : పంట నష్టంతో మనస్తాపం.. ఇద్దరు మిర్చి రైతుల ఆత్మహత్య - farmer suicide in reddipalli

Farmers Suicide due to crop loss : వ్యవసాయంలో నష్టం వచ్చినా కూడా.. మరో ఏడాది పంటలు బాగా పండుతాయని ఆశతో సాగు చేస్తుంటారు అన్నదాతలు. అదే ఆశతో అప్పు తెచ్చి పెట్టుబడి పెట్టారు. ఈ సారి అయినా పంటలు బాగా పండుతాయని అనుకున్నారు. తీరా చూస్తే మిర్చి పంటపై తామర పురుగు దాడి చేసింది. వడగండ్ల వాన చేతికందవచ్చిన పంటలను నాశనం చేసింది. ఓ వైపు పంటనష్టం.. మరోవైపు అప్పుల బాధ.. చేసేది లేక ఇద్దరు రైతులు ఉసురు తీసుకున్నారు.

Farmer Suicide in Beruwada, Farmers Suicide due to crop loss
పంట నష్టంతో మనస్తాపం.. ఇద్దరు మిర్చి రైతుల ఆత్మహత్య
author img

By

Published : Jan 19, 2022, 9:50 AM IST

Farmers Suicide due to crop loss : అప్పుల బాధతో మరో ఇద్దరు రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి సాగు చేస్తే... నష్టాలే మిగిలాయి. ఓవైపు మిరప చేనుపై తామర పురుగు... మరోవైపు వడగండ్ల వానలతో అన్నదాత ఆశలు అడియాసలయ్యాయి. మనస్తాపం చెందిన ఇద్దరు రైతులు వేర్వేరుగా పురుగుల మందు తాగి బలవన్మరణం చెందారు.

ఏం జరిగింది?

మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం బేరువాడలో విషాదం చోటుచేసుకుంది. అప్పుల బాధతో రైతు భాస్కర్.. పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. తనకున్న ఎకరం భూమితోపాటు మరో ఎకరం కౌలు తీసుకుని మిర్చి సాగు చేశారు. రెండు లక్షల రూపాయలు అప్పు ఉండగా... మరో రూ.లక్షా 50 వేలు అప్పు తెచ్చి పెట్టుబడి పెట్టారు.

రుణం తీర్చలేక..

తామర పురుగుతో మిర్చి దెబ్బతినగా, అకాల వర్షాల వల్ల పూర్తిగా నష్టపోయారు. రుణం తీర్చలేనని మనోవేదనకు గురై ఈ నెల 14న రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

వడగండ్ల వాన తెచ్చిన నష్టం

వడగండ్ల వాన కురిసి... పంట దెబ్బతినడంతో మరో రైతు ఆత్మహత్య చేసుకున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలం రెడ్డిపల్లికి చెందిన సుగులం అనంతరామ్ బలవన్మరణం చెందారు. ఆయన రెండు ఎకరాల్లో మిరప, నాలుగు ఎకరాల్లో పత్తి పంటను సాగు చేశారు. ఇటీవలి వడగండ్ల వర్షాలకు దెబ్బతినడంతో తీవ్ర మనస్తాపం చెంది... సోమవారం రాత్రి పురుగుల మందు తాగారు. ఇది గమనించిన కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందారు. ఈ మేరకు మృతుడి భార్య సావిత్రి పోలీసులకు మంగళవారం ఫిర్యాదు చేశారు.

ఇదీ చదవండి: Toll plazas sankranthi revenue 2022 : కాసులు కురిపించిన సంక్రాంతి.. టోల్‌ప్లాజాలకు దండిగా ఆదాయం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.