ETV Bharat / crime

Girl Suicide: వివాహితుడి వేధింపులు తాళలేక బాలిక ఆత్మహత్య - Telangana crime news

Girl Suicide due to harassments: కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ వివాహితుడి వేధింపులతో బాలిక జీవితం బుగ్గి పాలైంది. తన వెంట పడొద్దని బతిమిలాడుకున్నా.. తిరస్కరించినా, పెద్ద మనుషుల్లో పంచాయితీ పెట్టించినా.. ఫలితం లేకపోయింది. అతడి వేధింపులు నిత్యకృత్యం కావడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో విగతజీవిగా మారింది.

Girl Suicide due to harassments
వివాహితుడి వేధింపులు తాళలేక బాలిక ఆత్మహత్య
author img

By

Published : Jan 29, 2022, 5:52 PM IST

Girl Suicide due to harassments: వివాహితుడి వేధింపులు తాళలేక ఓ బాలిక తనువు చాలించిన ఘటన.. నల్గొండ జిల్లాలో చోటుచేసుకుంది. పెళ్లయి పిల్లలున్న ఆ కీచకుడు తనను పెళ్లి చేసుకోవాలంటూ బాలిక వెంటపడి వేధింపులకు గురిచేయడంతో ఓపిక నశించి మరణమే శరణ్యమనుకుంది. దామరచర్ల మండల పరిధికి చెందిన ఓ మైనర్​.. ఈనెల 24 న పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. మిర్యాలగూడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు మృతి చెందింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు.

భూక్య కృష్ణ అనే వ్యక్తి వేధింపుల కారణంగానే తన కుమార్తె ఆత్మహత్యకు పాల్పడినట్లు మృతురాలి తండ్రి ఆరోపించారు. వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నప్పటికీ పెళ్లి చేసుకోవాలని తన కుమార్తె వెంటపడ్డాడని తండ్రి, కుటుంబీకులు ఆరోపించారు. ఇందుకు ఒప్పుకోకపోవడంతో మానసికంగా వేధింపులకు గురి చేసినట్లు వివరించారు. విషయం తెలిసి తాము కృష్ణను మందలించామని.. పెద్ద మనుషుల్లో పంచాయితీ కూడా పెట్టామని చెప్పారు.

అయినా తీరు మార్చుకోకుండా పదే పదే వెంటపడుతూ వేధించడంతో బాధితురాలు ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపారు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడిని కఠినంగా శిక్షించి తమకు న్యాయం చేయాలని మృతురాలి తల్లిదండ్రులు కోరారు.

ఇదీ చదవండి: డ్రగ్స్​ కేసులో టోనీని కస్టడీలోకి తీసుకున్న పోలీసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.