ETV Bharat / crime

దారుణం: బాలికపై పెద్దనాన్న అత్యాచారం - బాలికపై అత్యాచారం వార్తలు

వరుసకు పెద్దనాన్న అయ్యే వ్యక్తి... బాలికపై అత్యాచారం చేశాడు. ఇంట్లో ఆడుకుంటున్న బాలికను బెదిరించి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డంతో గర్భం దాల్చింది.

rape
rape
author img

By

Published : May 30, 2021, 11:50 AM IST

హైదరాబాద్‌ జగద్గిరిగుట్టలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. వరుసకు పెద్దనాన్న అయ్యే వ్యక్తి... బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. రాములు అనే వ్యక్తి... ఇంట్లో ఆడుకుంటున్న బాలికను బెదిరించి అత్యాచారం చేశాడు. ఎవరికైనా చెబితే తల్లిదండ్రులను చంపేస్తానని బెదిరించటంతో... భయపడిన బాధితురాలు మౌనంగా ఉండిపోయింది.

బాలికను బెదిరిస్తూ పలుమార్లు అత్యాచారానికి పాల్పడటంతో గర్భం దాల్చింది. ఐదు రోజుల క్రితం బాలిక కడుపు నొప్పిగా ఉందని చెప్పటంతో... తల్లి ఆసుపత్రికి తీసుకెళ్లగా... గర్భం దాల్చినట్లు వైద్యులు తెలిపారు. బాలికను నిలదీయటంతో తనపై జరిగిన అఘాయిత్యం గురించి చెప్పింది.

బాధిత కుటుంబం ఫిర్యాదు చేయటంతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఫిర్యాదు చేశాక నిందితుడి కుటుంబ సభ్యులు తమ‌ ఇంటిపై దాడి చేశారని బాధితురాలి తల్లి వాపోయింది. కేసును వెనక్కి తీసుకోవాలని... లేకుంటే పెట్రోల్ పోసి తగులపెడుతామని బెదిరిస్తున్నారని... తమకు న్యాయం చెయ్యాలని బాలిక తల్లి విజ్ఞప్తి చేస్తుంది.

ఇదీ చదవండి: అమానుషం: కన్నకూతురిపైనే తండ్రి అత్యాచారం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.