ETV Bharat / crime

జవహర్​నగర్​లో మైనర్​ బాలిక అదృశ్యం... - kidnap case updates

ఓ మైనర్ బాలిక అపహరణకు గురైన ఘటన సికింద్రాబాద్​లోని జవహర్​నగర్​ పోలీస్​స్టేషన్​ పరిధిలో జరిగింది. అదృశ్యం కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.

minor girl kidnaped at javaharnagar area

author img

By

Published : Feb 9, 2021, 9:21 AM IST

సికింద్రాబాద్​లోని జవహర్​నగర్​ పోలీస్​స్టేషన్​ పరిధిలో ఓ మైనర్ బాలిక అపహరణకు గురైంది. మహబూబ్​నగర్ జిల్లా దీరపల్లికి చెందిన కిష్టప్ప... జవహర్​నగర్​లో మేస్త్రి. జమ్మిగడ్డలో నివాసముంటున్న కిష్టప్ప కూతురు ఆదివారం సాయంత్రం మూడు గంటల నుంచి కనిపించకుండా పోయింది.

ఎంత సమయమైనా బాలిక ఇంటికి రాకపోవటం వల్ల...తెలిసిన చోట్లు వెతికినా లాభం లేకపోయింది. చేసేదేమీలేక పోలీసులకు తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. అదృశ్యం కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. అమ్మాయితో ఓ వ్యక్తికి పరిచయం ఉన్నట్లు... అతను తరచూ ఫోన్ చేస్తున్నట్లు పోలీసులకు తల్లిదండ్రులు వివరించారు. అతడే తమ కూతురిని అపహరించి ఉండవచ్చని పోలీసుల ఎదుట అనుమానం వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి: పేస్టులా బంగారాన్ని మార్చి... ఎయిర్​పోర్టులో దొరికి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.