మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న మధుసూదన్ అనే వ్యక్తి లాడ్జి అద్దాలను ధ్వంసం చేసిన ఘటన నిర్మల్ జిల్లా కేంద్రంలో జరిగింది. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు.
జిల్లా కేంద్రంలోని బంగల్ పేట్ ప్రాంతానికి చెందిన మధుసూదన్ కొద్ది కాలంగా మానసిక అనారోగ్యంతో బాధ పడుతున్నాడు. ఈ క్రమంలో వివేక్ జోక్ సమీపంలోని తిరుమల లాడ్జికి గొడ్డలితో వచ్చిన అతను అద్దాలను ధ్వంసం చేశాడు. ఈ ఘటనలో అతని చేతికి కూడా గాయాలవ్వడంతో తీవ్ర రక్త స్రావం అయింది.
స్థానికుల సమాచారం మేరకు అక్కడికి చేరుకున్న పోలీసులు నిందితున్ని అదుపులోకి తీసుకుని చికిత్స కోసం ఆసుపత్రికి తరలిస్తామని తెలిపారు. గతంలోను మధుసూదన్ ఇదే తరహా దాడులకు పాల్పడగా ఆసుపత్రిలో చికిత్స చేయించినా ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదని స్థానికులు తెలిపారు.
ఇదీ చదవండి: గతంలో అనిశాకు చిక్కి... ఇప్పుడు వారికే పట్టించి