ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం మాకోడకు చెందిన బురత్కర్ చైతన్య(22).. 2018లో ఉపాధి శిక్షణ (Employment training) పొందుతున్న సమయంలో ఓ యువతిని వేధించేవాడు (HARASSED). ఆమెకు వివాహమైనా చైతన్య ఆగడాలు మానలేదు. ఈ క్రమంలో యువతి కుటుంబ సభ్యులు పథకం ప్రకారం.. ఈనెల 9న ఆమె ద్వారా చైతన్యకు ఫోన్ చేయించి ఇంటికి పిలిపించారు.
చైతన్య ఇంటికి రాగానే ఏడుగురు కుటుంబ సభ్యులు అతడిపై దాడి (Attack) చేశారు. పార, కట్టెలతో కొట్టి ప్రాణాలు తీశారు. అనంతరం పరుపులో చుట్టి ఇల్లు ఖాళీ చేస్తున్నట్లు నటిస్తూ మృతదేహాన్ని ఆటోలో వేసుకొని బయటపడ్డారు. తోవలో పెట్రోలు కొని, తలమడుగు మండలం దేవాపూర్ శివారులో మృతదేహాన్ని తగలబెట్టారు. బాధితుడి కుటుంబ సభ్యులు చైతన్య కనిపించటం లేదని ఆదిలాబాద్ ఒకటో పట్టణ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేయగా అదృశ్యం కేసు నమోదైంది. దేవాపూర్ శివారులో కాలిన శవం గుర్తించిన తలమడుగు ఎస్సై దివ్యభారతి ఈ నెల 14న కేసు నమోదు చేశారు. జిల్లా ఇన్‌ఛార్జి ఎస్పీ ప్రత్యేకంగా డీఎస్పీ వెంకటేశ్వర్‌రావు నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (Special Investigation Team) ఏర్పాటుచేశారు. కాలిన శవం చైతన్యదిగా నాలుగు రోజుల్లోనే పోలీసులు గుర్తించారు. ఫోన్ వివరాలు, సీసీ కెమెరాల ఫుటేజీల ఆధారంగా నిందితుల వివరాలు తెలుసుకున్నారు. నిందితులు ఏడుగురినీ పోలీసులు అరెస్టు చేశారు. వీరిని కోర్టులో హాజరుపరిచినట్లు ఎస్పీ రాజేష్ చంద్ర వివరించారు.
ఇదీ చూడండి: Prison: బ్లూ ఫిల్స్మ్ చూస్తున్నారా? అయితే నేరుగా జైలుకే.. రూ.10 లక్షల జరిమానా!