ETV Bharat / crime

ములుగు జిల్లాలో మావోయిస్టు యాక్షన్‌ టీమ్‌.. అప్రమత్తమైన పోలీసులు - Mulugu SP Sangram Singh Patil

Maoist action team in Mulugu : తెలంగాణలోని ములుగు జిల్లాలో మావోయిస్టు యాక్షన్‌ టీమ్‌ సంచరిస్తోందని విశ్వసనీయ సమాచారం ఉందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ సంగ్రామ్‌ సింగ్‌ పాటిల్‌ తెలిపారు. నలుగురు సభ్యులు గల మావోయిస్టు యాక్షన్‌ టీమ్‌ వివరాలతో ఉన్న వాల్‌ పోస్టర్‌ను ఎస్పీ విడుదల చేశారు.

Maoist action team
Maoist action team
author img

By

Published : Dec 11, 2022, 7:20 PM IST

Maoist action team in Mulugu: తెలంగాణలోని ములుగు జిల్లాలో మావోయిస్టు యాక్షన్‌ టీమ్‌ సంచరిస్తోందని విశ్వసనీయ సమాచారం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ములుగు జిల్లా ఎస్పీ సంగ్రామ్‌ సింగ్‌ పాటిల్‌ తెలిపారు. నలుగురు సభ్యులు గల మావోయిస్టు యాక్షన్‌ టీమ్‌ వివరాలతో ఉన్న వాల్‌ పోస్టర్‌ను ఎస్పీ విడుదల చేశారు. మావోయిస్టుల ఆచూకీ తెలిపిన వారికి రూ.5 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు నగదు బహుమతి అందిస్తామని, ఆచూకీ తెలిపిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని వెల్లడించారు.

మావోయిస్టులు హింసాత్మక పద్ధతిలో సాధించేది ఏమీ ఉండదని, ఆయుధాలు వీడాలని సూచించారు. అభివృద్ధి నిరోధకులుగా మావోలు మారారని విమర్శించారు. ప్రజల స్వేచ్ఛకు భంగం కలిగిస్తే ఉక్కుపాదం మోపుతామన్నారు. జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో మావోయిస్టు యాక్షన్‌ టీమ్‌ సభ్యుల వాల్‌పోస్టర్లు అంటించామని, అనుమానాస్పద వ్యక్తులు ఎవరైనా కనిపిస్తే SP ములుగు 7901100333, అదనపు ఎస్పీ 9440795243, OSD 9440795202, CI ములుగు 9440795229, SI ములుగు 9493327102 నంబర్లకు లేదా డయల్ 100కు సమాచారం ఇవ్వాలని ఎస్పీ కోరారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.