Man tries to Kill His Girlfriend in Hanamkonda: పెళ్లికి అంగీకరించడం లేదని ఓ యువకుడు ప్రేయసి గొంతు కోసి తీవ్రంగా గాయపరిచాడు. హనుమకొండ జిల్లా కాజీపేట మండలం కడిపికొండలో మంగళవారం రాత్రి ఈ సంఘటన చోటుచేసుకుంది. స్థానికులు, మడికొండ పోలీస్ ఇన్‌స్పెక్టర్ గుజ్జేటి వేణు కథనం ప్రకారం.. కడిపికొండకు చెందిన సివ్వి శ్రీనివాస్ (35) అదే గ్రామానికి చెందిన యువతి (26) కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఇద్దరి మతాలు వేరు కావడంతో అతడు ఆమె మతాన్ని స్వీకరించినట్లు తెలిసింది. పెళ్లికి యువతి కుటుంబసభ్యులు అంగీకరించకపోవడంతో ఇద్దరూ కొద్దిరోజులుగా గొడవలు పడుతున్నారు.
ఇదే విషయంపై శ్రీనివాస్ మంగళవారం రాత్రి యువతి ఇంటికి వెళ్లి నిలదీశాడు. అంగీకరించకపోవడంతో యువతి గొంతు, చేయి కోసి గాయపరిచాడు. ఆగ్రహించిన ఆమె కుటుంబసభ్యులు అతడిని చితకబాదారు. సమాచారం అందుకున్న మడికొండ పోలీసులు గ్రామానికి చేరుకుని యువతిని వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ఆమెకు ప్రాణాపాయం లేదని, విచారణ చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్ వివరించారు.
ఇవీ చదవండి: