ETV Bharat / crime

FAKE NOTES: యూట్యూబ్‌ చూసి.. దొంగనోట్లు తయారీ చేసి.. - ap news

సామాజిక మాధ్యమాల్లో లేని సమాచారమంటూ ఉండదు.. ప్రత్యేకంగా యూట్యూబ్​. దీనివల్ల చాలామంది ఎన్నో విషయాలు నేర్చుకుంటున్నారు. యూట్యూబ్​లో చూసి వంట, పెయింటింగ్​, గార్డెనిండ్ ఇలా ఎన్నో.. నేర్చుకునే వాళ్లుంటారు. కొంతమంది తమకు పనికివచ్చే మంచి విషయాలు తెలుసుకుంటున్నారు. మరికొంతమంది మాత్రం వక్రమార్గంలో నడిచేందుకు దారులు వెతుకుతున్నారు. ఇలాంటి కోవకు చెందినవాడే ఈ వ్యక్తి.. యూట్యూబ్​లో చూసి దొంగనోట్లు తయారు చేశాడు. అంతేగాకుండా వాటితోనే వడ్డీ వ్యాపారం చేస్తూ భారీగా సంపాదించాడు.

fake currency
దొంగనోట్లు తయారీ చేసి..
author img

By

Published : Jul 2, 2021, 2:26 PM IST

ఆంధ్రప్రదేశ్​లో కలకలం సృష్టించిన దొంగనోట్ల కేసును కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. దొంగనోట్లు తయారు చేస్తూ హల్​చల్​ చేస్తున్న ముఠాను అరెస్ట్ చేశారు. విచారణలో నిజాలు తెలుసుకుని పోలీసులు ఆశ్చర్యపోయారు. ఎందుకంటే వాళ్లు యూట్యూబ్​ చూసి ఏకంగా దొంగ నోట్లు ముద్రిస్తున్నారు.

కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలో గత నెల 23వ తేదీన దూలం సాయి, గొట్టిముక్కల రవిశరన్‌, భీమవరపు యజ్ఞప్రదీప్‌, నాగమల్లేశ్వరరావు అనే వ్యక్తుల వద్ద దొంగనోట్లు లభించడంతో ఇబ్రహీంపట్నం పోలీసులు అదేరోజు కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారంలో కీలక నిందితుడైన తూర్పు గోదావరి జిల్లా అనపర్తికి చెందిన కృష్ణారెడ్డి అనే యువకుడిని గురువారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

ఇదీ చదవండి: "దొంగ"లు దొరికారు: రూ.7 కోట్ల నకిలీ నోట్లు స్వాధీనం

విచారణ చేపట్టిన సీఐ బృందం తూర్పు గోదావరి జిల్లా అనపర్తిలో దాని మూలాలు కనుగొన్నారు. యువకుల వద్ద సేకరించిన సమాచారంతో.. అనపర్తిలోని ఓ పెట్రోల్‌ బంకులో పని చేసే వ్యక్తిని ముందుగా అదుపులోకి తీసుకున్నారు. అతని ద్వారా అసలు నిందితుడైన కృష్ణారెడ్డిని అరెస్ట్ చేసి విచారించారు. యూట్యూబ్‌లో చూసి నోట్లను తయారు చేశానని యువకుడు చెప్పిన మాటలకు పోలీసులు విస్తుపోయారు. యూట్యూబ్‌ చూసి నేర్చుకున్న అతడు చాకచక్యంగా దొంగనోట్లను అచ్చు దింపేశాడు. అంతటితో ఆగకుండా వడ్డీ వ్యాపారం చేస్తూ నగదును పలు విధాలా మార్పిడి చేసి గట్టిగా సంపాదించాడు. సొంతంగా తయారు చేసిన నోట్లను వివిధ చోట్లకు చలామణి చేశాడు.

Fake Currency: యూట్యూబ్ చూసి దొంగనోట్ల తయారీ.. మరోసారి పోలీసులకు చిక్కి..

తయారు చేశాడిలా..

ఒక సాధారణ తెల్లటి పేపర్‌పై రూ.200, 500 నోట్లను రెండువైపులా అంటించి ముద్రించడం, ఎటువంటి తేడాలు లేకుండా కట్‌ చేయడం, శుభలేఖల పేపర్‌పై నిజమైన నోట్ల మాదిరిగా వాటిని ముద్రించడాన్ని స్వయంగా చూసిన పోలీసులు ఖంగుతిన్నారు. తాను వడ్డీకి తిప్పే నగదు కట్లలో ఐదు నోట్లను ఉంచి నోట్లను మార్చేవాడినని నిందితుడు పోలీసులకు తెలిపాడు. ఇంతేకాకుండా అనపర్తి పెట్రోల్‌ బంకులో పని చేసే వ్యక్తికి కమీషన్‌ ఇచ్చి నోట్ల మార్పిడి చేశానని వెల్లడించాడు. దొంగనోట్ల మార్పిడిని గత రెండేళ్ల నుంచి చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. దాదాపు రూ.రెండు కోట్లు వెనకేసి ఉంటాడని భావిస్తున్నారు. నోట్లు ముద్రించే కృష్ణారెడ్డితో పాటు సహకరించిన అనపర్తికి చెందిన దొరబాబును ఇబ్రహీంపట్నంకు చెందిన నలుగురు యువకులను రిమాండ్‌కు పంపారు.

ఇదీ చూడండి: కర్ణాటకలో భారీగా దొంగ నోట్లు స్వాధీనం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.