murder in prakasam: చిన్న విషయం పెద్ద వివాదానికి దారి తీసింది. ఓ వ్యక్తి హత్యకు కారణమైంది. ఈ ఘటన ఏపీలోని ప్రకాశం జిల్లాలో జరిగింది. పుల్లలచెరువు మండల కేంద్రంలోని ఎస్సీపాలెంలో రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. బడిపాటి నవీన్ అనే వ్యక్తి మద్యం మత్తులో గ్లాడ్సన్ అనే వ్యక్తి వద్దకు వెళ్లి ఫోన్ కావాలి.. కాల్ చేసుకొని ఇస్తానని చెప్పగా.. గ్లాడ్సన్ తన ఫోన్ ఇచ్చాడు. అయితే నవీన్ తిరిగి ఇచ్చిన తర్వాత తన ఫోన్ కవర్లో దాచుకున్న రూ.500 నోటు కనిపించలేదు. దీంతో.. డబ్బుల విషయమై గ్లాడ్సన్ నవీన్‌ను ప్రశ్నించాడు.
దీంతో.. ఇరువురి మధ్య ఈ విషయమై వాగ్వాదం మొదలైంది. చినికి చినికి గాలివానగా మారింది. ఆ తర్వాత అది ఇరు కుటుంబాల మధ్య ఘర్షణకు దారి తీసింది. ఈ విషయం తెలుసుకున్న గ్లాడ్సన్ బంధువులైన రావూరి ఆశీర్వాదం, ఆనందరావు వెళ్లి మాట్లాడుతుండగా నవీన్ కత్తితో వారిపై దాడి చేశాడు. ఈ దాడిలో ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డాడు. వీరిని యర్రగొండపాలెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆశీర్వాదం మృతిచెందాడు. ఆనందరావును మెరుగైన వైద్యం కోసం నరసరావుపేటకు తరలించారు. సమాచారం అందుకున్న యర్రగొండపాలెెం సీఐ ఘటనా స్థలికి చేరుకొని హత్యకు గల కారణాలను తెలుసుకున్నారు.