ETV Bharat / crime

Live Video: మణికొండ ఘటనలాంటిదే ఇంకోటి.. అదే రోజు జరిగినా అలస్యంగా వెలుగులోకి..

ఈ నెల 25న హైదరాబాద్​ నాలాలు ఉగ్రరూపం దాల్చాయి. మణికొండలో ఓ సాఫ్ట్​వేర్​ ఇంజినీర్​ని బలితీసుకోగా(Hyderabad nala death).. అదే రోజున కుత్బుల్లాపూర్​లో అచ్చం అలాంటి ఘటనే ఇంకోటి జరిగింది. కానీ.. ఆ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మణికొండ ఘటనలో మూడు రోజులకు మృతదేహం లభ్యం కాగా... కుత్బుల్లాపూర్​ ఘటనలో మాత్రం గల్లంతైన వ్యక్తి ఆచూకీ ఇప్పటి వరకు దొరకలేదు.

man missing in nala at kuthubullapur on 25th september

author img

By

Published : Sep 29, 2021, 7:32 PM IST

హైదరాబాద్​ మణికొండ నాలా ఘటన(Manikonda Man Missing Incident) లాంటిదే.. అదే రోజున ఇంకోటి జరిగింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మేడ్చల్​ జిల్లా కుత్బుల్లాపూర్​లో ఓ వ్యక్తి నాలాలో గల్లంతయ్యాడు. కాకాపోతే.. మణికొండ ఘటనలో మూడు రోజులకు బాధితుని మృతదేహం లభ్యమైంది. కుత్బుల్లాపూర్​లో గల్లంతైన వ్యక్తి ఆచూకీ మాత్రం ఇప్పటివరకు లభ్యం కాలేదు.

సిగరెట్​ తాగుతూ వెళ్లి..

కుత్బుల్లాపూర్ గణేశ్​ టవర్స్​లో నివాసముండే మోహన్​రెడ్డి ఈ నెల 25న.. రాయల్ వైన్స్ వద్ద స్నేహితులతో కలిసి మద్యం సేవించాడు. ఇంటికి బయలుదేరే సమయంలో భారీ వర్షం రావడంతో స్నేహితులు ఇద్దరు పక్కకు ఆగారు. మోహన్​రెడ్డి మాత్రం సిగరెట్ తాగుతూ నాలా పక్కన నిలబడ్డాడు. చూస్తూండగానే.. ఒక్కసారిగా వెనకకు నాలాలో పడిపోయాడు. గమనించిన స్నేహితులు మోహన్​రెడ్డిని పట్టుకునేందుకు ప్రయత్నించారు. వరద ఉద్ధృతి ఎక్కువగా ఉండటం వల్ల మోహన్​రెడ్డి కొట్టుకుపోయాడు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు... ఇప్పటివరకు నాలాలన్ని గాలించినా ఆచూకీ లభించలేదు.

మణికొండ ఘటనలాంటిదే ఇంకోటి.. అదే రోజు జరిగినా అలస్యంగా వెలుగులోకి..

మోహన్​రెడ్డి కుటుంబ సభ్యులు జీహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన అధికారులు.. రెస్క్యూ బృందాలను పంపించి గాలింపు చర్యలు చేపట్టారు. చూస్తుండగానే... మోహన్​రెడ్డి ఒక్కసారిగా నాలాలో పడిపోయిన దృశ్యాలు సీసీకెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి. ఈ వీడియో ఇప్పడు సోషల్​ మీడియాలో వైరల్​ అయ్యాయి.

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.