ప్రేమ పేరుతో వాట్సాప్ సందేశాల ద్వారా వేధిస్తున్న ఓ యువకుడిని రాచకొండ సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు. తాండూరుకి చెందిన శివ కుమార్కు స్నాప్ చాట్లో నగరానికి చెందిన యువతి పరిచయం అయింది. అది కాస్తా స్నేహంగా మారింది. యువతిని కలిసేందుకు హైదరాబాద్ వచ్చిన శివకుమార్ తన ప్రేమ విషయం ఆమెకు చెప్పాడు. వ్యతిరేకించిన యువతి తనకు పెళ్లి కుదిరిందని.. త్వరలో తన పెళ్లి జరగనుందని చెప్పింది.
యువతిపై కోపం పెంచుకున్న శివ ఆమెకు వాట్సాప్లో అసభ్యకర సందేశాలు పంపించడం ప్రారంభించాడు. అంతే కాకుండా పెళ్లి చేసుకునే వ్యక్తికి కూడా అసభ్యకర సందేశాలు పంపించాడు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. దర్యాప్తు చేసిన రాచకొండ పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
ఇదీ చదవండి: 'మానుకోట తిరుగుబాటు.. సమైక్యాంధ్రుల మీద సాధించిన గొప్ప విజయం'