భార్యపై కక్ష కట్టి గొడవ పడటానికి వెళ్లి అత్తమామలపై అల్లుడు వల్లకొండ సాయికృష్ణ పెట్రోల్ పోసి నిప్పంటించిన కేసులో తీవ్రంగా గాయపడ్డ తీగల సాగర్‌రావు (55) గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం సాయంత్రం మృతిచెందారు. ఆయన భార్య రమాదేవి చికిత్స పొందుతున్నారు.
సాయికృష్ణపై కేసు నమోదు చేసిన కేపీహెచ్‌బీ పోలీసులు.. అతని భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు సాయికృష్ణకు సహకరించిన ముగ్గురిని అరెస్టు చేసినట్లు సీఐ లక్ష్మీనారాయణ తెలిపారు. ఈనెల 9న రాత్రి 9 గంటల సమయంలో సాయికృష్ణ అత్తగారింటికి అతనితోపాటు అతని స్నేహితులు పేర్యాల సాయికృష్ణ (27), నుడుగొండ సంతోశ్ (27) కూడా వచ్చినట్లు పోలీసులు తెలుసుకున్నారు. ప్రోత్సహించిన సాయికృష్ణ తండ్రి వల్లకొండ వెంకటేశ్వరరావు (58)ను కరీంనగర్‌లో అదుపులోకి తీసుకున్నారు.