Tragedy in kantivelugu Man died of heart attack: ప్రభుత్వం కంటి వెలుగు పరీక్షలు కార్యక్రమాన్ని చేపట్టగా కంటి పరీక్షలు చేసుకునేందుకు మొగులాల్ అనే వ్యక్తి కంటి పరీక్షల కేంద్రం దగ్గరికి వచ్చాడు. కంటి చూపు పరీక్షలు నిర్వహిస్తుండగా ఒకసారిగా చాతి నొప్పితో విలవిలలాడటంతో అక్కడే ఉన్న వైద్యులు ప్రథమ చికిత్స చేసి నాగర్ కర్నూల్ జిల్లా ఆసుపత్రికి అంబులెన్స్‌లో తరలించారు. అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
ఆసుపత్రిలో పరీక్షలు నిర్వహించిన అనంతరం బాధితుడు గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. గత కొంతకాలంగా మొగులాల్ అనారోగ్యంతో ఉన్నట్లు, తరచు ఫిట్స్ వస్తు ఇబ్బందులు పడేవాడని బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు. అనంతరం ఆసుపత్రి నుంచి మృతదేహాన్ని కుటుంబ సభ్యులు తీసుకొని స్వగ్రామానికి తిరిగి వెళ్లారు.
ప్రారంభమైన కంటివెలుగు పరీక్షలు:
రాష్ట్రవ్యాప్తంగా రెండో విడత కంటి వెలుగు కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. ఖమ్మంలో 4 రాష్ట్రాల ముఖ్యమంత్రుల చేతుల మీదుగా లాంఛనంగా ప్రారంభోత్సవం జరగటంతో... క్షేత్రస్థాయిలో 16వేలకు పైగా కేంద్రాల్లో 1500 బృందాలు రంగంలోకి దిగాయి. కంటివెలుగు శిబిరాలను ప్రారంభించిన మంత్రులు, ఎమ్మెల్సీలు... దేశానికే ఆదర్శంగా నిలిచే కార్యక్రమంగా అభివర్ణించారు.
ఇవీ చదవండి: