ETV Bharat / crime

ఫోన్​ లిఫ్ట్​ చేయలేదన్న కోపంతో బ్లేడ్​తో మహిళ గొంతు కోసేశాడు.. - మహిళ గొంతు కోసిన ఉన్మాది వార్తలు

తన కాల్​ లిఫ్ట్​ చేయటం లేదన్న కోపంతో ఓ యువకుడు బ్లేడుతో మహిళ గొంతు కోసేశాడు. ఈ దారుణ ఘటన ఏపీలోని నెల్లూరు జిల్లా రేబాల గ్రామంలో చోటుచేసుకుంది. ఈ ఘటనకు వివాహేతర సంబంధమే కారణంగా పోలీసులు ప్రాథమికంగా నిర్ధరించారు.

man cut a women throat with blade for not answering his call

author img

By

Published : Jul 20, 2022, 8:46 PM IST

ఏపీలోని నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం రేబాల గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. తన ఫోన్ ఎత్తటంలేదన్న కారణంతో ఓ యువకుడు బ్లేడుతో మహిళ గొంతు కోశాడు. గ్రామానికి చెందిన ఓ మహిళకి కోవూరుకు చెందిన వెంకట్ అనే యువకుడితో వివాహేతర సంబంధం ఉన్నట్లు సమాచారం. ఇటీవల ఆ మహిళ వెంకట్​ను దూరం పెడుతూ వస్తోంది. ఫోన్ చేసినా స్పందించటం లేదు.

తనను దూరం పెట్టటం సహించని వెంకట్​ సదరు మహిళపై కక్ష పెంచుకున్నాడు. తన స్నేహితుడు రవిని తీసుకొని మహిళ ఇంటికి వెళ్లి నిలదీశాడు. ఈ క్రమంలో వాళ్ల మధ్య గొడవ జరిగింది. కోపంతో ఊగిపోయిన వెంకట్​.. ఆవేశంలో బ్లేడుతో మహిళ గొంతు కోశాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యేందుకు ప్రయత్నించగా.. స్థానికులు పట్టుకొని స్తంభానికి కట్టేశారు. పోలీసులకు సమాచారం ఇవ్వటంతో నిందితులను అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలు ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

ఇవీ చూడండి..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.