ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా సీతానగరంలో ఓ వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇనుగంటివారి పేటకు చెందిన కిరణ్‌కుమార్‌కు భార్యతో గొడవ పడ్డాడు.
ఆ క్రమంలోనే అత్త పోచివేణి, మామ వెంకటరమణలు వేధించారంటూ సెల్ఫీ వీడియో తీసుకుంటూ కలుపు మందు తాగేశాడు. అపస్మారక స్థితిలో ఉన్న కిరణ్‌కుమార్‌ని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. సీతానగరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీచూడండి: వీరప్పన్ తూటాలకు ఎదురు నిలిచిన పోలీసు మృతి