ETV Bharat / crime

'మున్సిపల్​ సిబ్బంది.. డబ్బులివ్వమని వేధిస్తున్నారు'

రంగారెడ్డి జిల్లా శంకర్​పల్లిలో.. మున్సిపల్​ సిబ్బంది తనను వేధిస్తున్నారని ఆరోపిస్తూ ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అమ్మకాలు జరపాలంటే.. డబ్బులివ్వాలని హింసిస్తున్నారంటూ మెడపై కత్తి పెట్టుకుని సెల్ఫీ వీడియోలో వాపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్​గా మారింది.

Man commits suicide as he is being harassed by municipal staff
వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు
author img

By

Published : May 28, 2021, 11:06 PM IST

మున్సిపల్​ సిబ్బంది వేధిస్తున్నారంటూ ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన రంగారెడ్డి జిల్లా శంకర్​పల్లిలో చోటు చేసుకుంది. తనపై కక్షపూరితంగా వ్యవహరిస్తూ.. అమ్మకాలను అడ్డుకుంటున్నారంటూ ఓ కొబ్బరిబొండాల వ్యాపారి.. సిబ్బందిపై ఆరోపణలు చేశాడు. 'వ్యాపారాన్ని నిలిపివేస్తే.. నాకు చావే దిక్కు' అంటూ మెడపై కత్తి పెట్టుకుని సెల్ఫీ వీడియోలో వాపోయాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి.

'అమ్మకాలు జరపాలంటే.. డబ్బులివ్వాలని నన్ను చాలా రోజుల నుంచి హింసిస్తున్నారు. బండి లాక్కుంటామంటున్నారు. రోడ్డు పక్కన ఎన్నో వ్యాపారాలు జరుగుతున్నాయి. వ్యాపారాన్ని మరో చోటుకు మార్చుకునేందుకు కాస్త సమయం కూడా ఇవ్వకుండా నాపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు.'

- బాధితుడు

వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు

ఇదీ చదవండి: Humanity: కన్న తల్లిలా.. కడుపు నింపుతోన్న టీచరమ్మ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.