ETV Bharat / crime

Suicide at Court: కోర్టు సమీపంలోనే.. పెట్రోల్‌ పోసుకొని బలవన్మరణం

Suicide at Court: ఓ వైపు అప్పుల బాధ.. మరోవైపు అప్పులిచ్చిన వాళ్ల కోర్టు కేసులతో వేదన. ఈ తిప్పలు భరించలేక.. కోర్టు సమీపంలోనే ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఒంటిపై కిరోసిన్​ పోసుకుని బలవన్మరణం చెందారు. ఏపీలోని గుంటూరు జిల్లాలో ఈ విషాదం చోటుచేసుకుంది.

Suicide at Court
కోర్టు ఎదుట ఆత్మహత్య
author img

By

Published : Jan 6, 2022, 12:55 PM IST

Suicide at Court: కోర్టు సమీపంలోనే ఓ వ్యక్తి ఒంటిపై పెట్రోల్​ పోసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్​లోని గుంటూరు జిల్లా తెనాలిలో ఈ విషాదం చోటు చేసుకుంది. బలవన్మరణానికి పాల్పడిన వ్యక్తిని అధ్యాపకుడిగా పోలీసులు గుర్తించారు. సూసైడ్‌ లెటర్ స్వాధీనం చేసుకున్న పోలీసులు.. అప్పుల బాధ తాళలేకనే ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు చెప్పారు.

వడ్డీలు కడుతున్నా..

తాళ్లూరి జకరయ్య (50) స్థానిక అంబేద్కర్ ఎయిడెడ్ కళాశాలలో ఫిజిక్స్ అధ్యాపకునిగా విధులు నిర్వహిస్తున్నారు. గతంలో వివిధ కారణాల వల్ల ఆయన అనేక అప్పులు చేశారు. అయితే.. వాటికి వడ్డీలు కడుతూ బాకీలు చెల్లిస్తున్నా.. కొన్ని అప్పులు తీరలేదు. దీంతో అప్పు ఇచ్చినవాళ్లు.. పదే పదే ఇబ్బందులు పెట్టడంతోపాటు అతనిపై కేసులు కూడా పెట్టారు. ఫలితంగా కోర్టు వాయిదాలకూ తిరుగుతున్నారు. ఈ ఇబ్బందులు తాళలేని జకరయ్య.. ఆత్మహత్య చేసుకోవడమే పరిష్కారంగా భావించారు. ఈ క్రమంలో.. మార్నింగా వాక్ పేరుతో ఇంటి నుంచి బయటకు వచ్చిన జకరయ్య.. కోర్టు ఎదుట పెట్రోల్​ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు.

విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఘటనా స్థలికి చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు. మృతదేహాన్ని తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. శవపరీక్ష అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఒకటో పట్టణ సీఐ కొమ్మలపాటి చంద్రశేఖర్ వెల్లడించారు.

ఇదీ చదవండి: Heavy Drugs Seized: హైదరాబాద్‌లో భారీగా డ్రగ్స్ పట్టివేత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.