ఇంట్లో అద్దెకుంటున్న ఓ వ్యక్తి ఆ ఇంటి యజమాని మనవడిపై హత్యాయత్నానికి పాల్పడిన ఘటన పటాన్చెరు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు జేపీ కాలనీ రెండో నంబర్ రహదారికి చెందిన ఓ ఇంట్లో రాజు అనే వ్యక్తి మూడు సంవత్సరాలుగా అద్దెకు ఉంటున్నాడు. అయితే ఆ ఇంటి యజమాని మనవడు దినేష్‌కు రాజుకు డబ్బు విషయంలో గొడవ జరిగింది.
కోపోద్రిక్తుడైన రాజు కత్తితో దినేష్ గొంతు కోసి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ప్రతిఘటిండం వల్ల దినేష్‌కు గొంతుతో పాటు చేతి వేళ్లు కూడా తెగి తీవ్ర గాయాలయ్యాయి. విషయం గుర్తించిన కుటుంబ సభ్యులు దినేష్‌ను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అనంతరం పోలీసులకు సమాచారమిచ్చి రాజుపై కేసు నమోదు చేయించారు. రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని పట్టుకునే పనిలో పడ్డారు.
ఇదీ చదవండి: అనాథలైన అక్కాచెల్లెల్లు... సాయం కోసం కన్నీళ్లతో ఎదురుచూపులు