యూసఫ్‌గూడలోని బీఎన్ఆర్ హిల్స్‌లో దారుణం చోటు చేసుకుంది. లావణ్య, రమేష్ దంపతులు స్థానికంగా నివాసముంటున్నారు. వీరికి కుమార్తె కూడా ఉంది. రమేష్ మద్యానికి బానిసై... రోజూ తాగి భార్యను వేధించేవాడు. ఈనెల 26వ తేదీన కూడా రమేష్ తాగి వచ్చి భార్యతో గొడవపడ్డాడు.
కోపోద్రిక్తుడైన అతను కూరగాయలు తరిగే కత్తిని భార్యపై విసిరాడు. లావణ్య తప్పించుకోగా... కత్తి నేరుగా అక్కడే ఉన్న కుమార్తె తలకు తగిలి తీవ్ర రక్తస్రావమైంది. ఈ ఘటనలోనే లావణ్య సోదరుని కుమారుడికి కూడా గాయలయ్యాయి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వివరించారు.
ఇదీ చూడండి: కిరాతకం: కట్టుకున్నదాన్ని.. కడుపున పుట్టిన వాళ్లని వదల్లేదు