ETV Bharat / crime

Attack With Knife: పెళ్లికి ఒప్పుకోలేదని.. కల్లు గీసే కత్తితో యువతిపై దాడి - పెళ్లికి నిరాకరించిందని యువతిపై దాడి

Attack With Knife
పెళ్లికి నిరాకరించిదని కత్తితో దాడి
author img

By

Published : Apr 25, 2022, 5:29 PM IST

Updated : Apr 25, 2022, 7:13 PM IST

17:25 April 25

Attack With Knife: పెళ్లికి ఒప్పుకోలేదని.. కల్లు గీసే కత్తితో యువతిపై దాడి

Attack With Knife: ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న కత్తి దాడులు తీవ్ర కలకలం రేపుతున్నాయి. సినిమాల ప్రభావమో ఏమో గానీ ప్రాణాలతో చెలగాట మాడుకుంటున్నారు. మొన్న వరంగల్​లో ప్రేమించలేదని కత్తితో గొంతు కోసిన ఘటన మరవకముందే ఇవాళ మరో దాడి జరిగింది. ఓ యువతి పెళ్లికి నిరాకరించిందనే కారణంతో ఉన్మాది కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన మంచిర్యాల జిల్లా నస్పూర్‌లో చోటు చేసుకుంది.

మందమర్రి మండలం బొక్కల గుట్ట గ్రామానికి చెందిన ఓ యువతి నస్పూర్​లోని బంధువుల గృహప్రవేశానికి వెళ్లారు. నస్పూర్​కు చెందిన సాయి కిరణ్ గౌడ్.. యువతిని పెళ్లి చేసుకుంటానని వారి బంధువులతో మాట్లాడగా నిరాకరించారు. దీంతో ఆక్రోశంతో గీత కార్మికులు ఉపయోగించే కత్తితో యువతిపై దాడికి దిగాడు. ఈ దాడిలో యువతి మెడకు గాయమవడంతో వెంటనే మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

మేమంతా గృహ ప్రవేశ కార్యక్రమానికి వచ్చినాం. ఓ ఉన్మాది మా మరదలిపై తాళ్లు గీసే కత్తితో దాడి చేసి గొంతు కోశాడు. ఈ దాడిలో చాలా రక్తం పోయింది. ఆమెను వెంటనే ప్రభుత్వ ఆస్పత్రిలో జాయిన్ చేశాం. మేం పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశాం. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

- బాధిత యువతి బావ

ఇవీ చూడండి: దంపతుల మధ్య ఘర్షణ.. పసికందును ఇటుక బట్టీకేసి కొట్టి చంపిన తండ్రి

attack on lady: యువతిపై బ్లేడుతో దాడి.. గతంలోనూ..!

11 కేజీల గోల్డ్ బిస్కెట్లు సీజ్​.. కార్​లో సీక్రెట్ చాంబర్స్.. ఓపెన్ చేస్తే రూ.కోటి!

Last Updated : Apr 25, 2022, 7:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.