ETV Bharat / crime

'కాంట్రాక్ట్​ తీసుకున్నాం.. వాహనాల నుంచి పెట్రోల్ దొంగతనం చేయడం మా హక్కు' - Bhuvanagiri railway latest news

రైల్వే స్టేషన్​లో పార్కింగ్​ చేసిన వాహనాల నుంచి పార్కింగ్​ నిర్వాహకుడు పెట్రోల్​ దొంగతనం చేశాడు. వాహనాల నుంచి పెట్రోల్​ ఎందుకు తీస్తున్నావని కానిస్టేబుల్ ప్రశ్నిస్తే... అతను దురుసుగా సమాధానం ఇచ్చాడు. కాంట్రాక్ట్​ తీసుకున్నామని... పెట్రోల్ తీయడం తమ హక్కని... ఏం చేసుకుంటావో చేస్కో అంటూ వాగ్వాదానికి దిగాడు. ఆ వీడియో వైరల్ అయింది.

Bhuvanagiri railway parking
Bhuvanagiri railway parking
author img

By

Published : Apr 11, 2022, 4:13 PM IST

భువనగిరి రైల్వే స్టేషన్‌లో పార్కింగ్ చేసిన వాహనాల నుంచి పెట్రోల్ దొంగతనం చేస్తున్న వాహన పార్కింగ్ కాంట్రాక్టర్ తమ్ముడు శ్రవణ్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భువనగిరి రైల్వే స్టేషన్​లో పార్కింగ్ చేసిన వాహనాల నుంచి పెట్రోల్ చోరీకి గురి అవుతోంది. శనివారం రాత్రి వాహనాల నుంచి శ్రవణ్ రెడ్డి పెట్రోలు దొంగతనం చేస్తుండగా కానిస్టేబుల్ వీడియో తీశాడు. పెట్రోల్ ఎందుకు తీస్తున్నావు అని కానిస్టేబుల్ ప్రశ్నించారు.

'కాంట్రాక్ట్​ తీసుకున్నాం.. వాహనాల నుంచి పెట్రోల్ దొంగతనం చేయడం మా హక్కు'

కానిస్టేబుల్ అడిగిన ప్రశ్నకు శ్రవణ్ రెడ్డి దురుసుగా సమాధానం ఇచ్చాడు. పార్కింగ్​లో ఉంచిన వాహనాలనుంచి పెట్రోల్ తీసే హక్కు తనకుందని చెప్పుకొచ్చాడు. ' సర్ మీరిక్కడ జాబ్​ చేస్తున్నారు. నాకు ఎట్ల పైసల్ వస్తాయి.' అంటూ ఎదురు ప్రశ్నించాడు. నేనే పెట్రోల్ తీస్తున్నా అంటూ బాటిల్​ను చూపిస్తూ వీడియో తీసుకోండి అంటూ భయం లేకుండా మాట్లాడాడు.

'అక్కడ ఒక బండి నుంచి తీశా... ఇక్కడో ఒండి నుంచి తీశా పెట్రోల్ తీశా. నాకు ఆ హక్కు​ ఉంది సర్. నేను కాంట్రాక్ట్​ తీసుకున్నా కాబట్టి నాకు ఆ హక్కు ఉంది.' అని శ్రవణ్​ రెడ్డి సమాధానమిచ్చాడు. అలా పెట్రోల్ తీసుకొమ్మని మీకు బాండ్ రాసిచ్చారా అని కానిస్టేబుల్​ ప్రశ్నిస్తే... కాంట్రాక్ట్​కు 12 లక్షలు కట్టు అంటూ దురుసుగా ప్రవర్తించాడు. తాము కాంట్రాక్ట్​ వదిలేస్తామని మీరు చూసుకోండి అని అన్నాడు.

'బ్రదర్ మీరు ఓవర్​గా రియాక్ట్​ అవుతున్నారు. కొత్తగా జాబ్​లో ఎక్కినట్లు ఉన్నారు. నువ్వు ఏం చేసుకుంటావో చేస్కో. మీలాంటోళ్లను మస్త్​ మందిని చూశా.' అంటూ కానిస్టేబుల్​తో శ్రవణ్​ రెడ్డి వాగ్వాదానికి దిగాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్​గా మారింది. రైల్వే పోలీసులు, స్టేషన్ మాస్టర్ ఇచ్చిన సమాచారం మేరకు... స్థానిక పోలీసులు నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు. వాహన పార్కింగ్ కాంట్రాక్టర్ హేమంత్ రెడ్డి, అతని సోదరుడు శ్రవణ్ రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు.

ఇదీ చదవండి: మెడికోతో లవ్ ఫెయిల్.. కక్షతో ల్యాప్​టాప్స్​ చోరీ.. ప్రతి కాలేజీకి టైమ్​టేబుల్ వేసి మరీ...

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.