ETV Bharat / crime

making adulterated milk: కల్తీ పాలు గుట్టురట్టు.. నిందితుడు అరెస్ట్​ - హైదరాబాద్ తాజా నేర వార్తలు

making adulterated milk: కల్తీ పాలు తయారుచేస్తున్న కేటుగాడిని పోలీసులు కటకటాల వెనక్కి నెట్టారు. నిందితుడి నుంచి 120 లీటర్ల కల్తీ పాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది.

Adulterated milk seized from the accused
నిందితుడి నుంచి స్వాధీనం చేసుకున్న కల్తీ పాలు
author img

By

Published : Mar 10, 2022, 5:45 PM IST

making adulterated milk: రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మేడిపల్లిలో కల్తీ పాలు తయారు చేస్తున్న పాల వ్యాపారి జంగారెడ్డి ఇంటిపై ఎల్బీనగర్ ఎస్​వోటీ పోలీసులు దాడి చేశారు. నిందితుడు హైడ్రోజన్ పెరాక్సైడ్, గోల్డ్​డ్రాప్ ఆయిల్, మిల్క్ పౌడర్‌ ఉపయోగించి కల్తీ పాలు తయారు చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు.

జంగారెడ్డిపై కేసు నమోదు చేసి యాచారం పోలీసులకు అప్పగించారు. నిందితుడి నుంచి 120 లీటర్ల కల్తీ పాలను స్వాధీనం చేసుకున్నారు.

ఇదీ చదవండి: Palvancha Suicide Case: వనమా రాఘవకు బెయిల్ మంజూరు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.