ETV Bharat / crime

బావను చంపిన బావమరుదులు.. అడ్డొచ్చిన వారిపైనా దాడి - man killed by his brother in laws at Jeedimetla

Double Murder at Jeedimetla : అక్కని వేధిస్తున్నాడని బావపై కత్తులతో దాడి చేశారు ఇద్దరు బావమరుదులు. అడ్డొచ్చిన బావ అన్నపై కూడా దాడి చేయగా అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన బావ, అతడి స్నేహితుణ్ని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ బావ కూడా మరణించాడు. ఈ ఘటన మేడ్చల్ జిల్లా జీడిమెట్లలో చోటుచేసుకుంది.

Double Murder at Jeedimetla
Double Murder at Jeedimetla
author img

By

Published : Mar 11, 2022, 11:26 AM IST

Double Murder at Jeedimetla : పెళ్లి చేసి ఆడపిల్లను అత్తారింటికి పంపేటప్పుడు తండ్రి ఎంత బాధ పడతాడో.. అంతకు రెట్టింపు బాధను ఆమో తోడబుట్టిన అన్నాదమ్ములు అనుభవిస్తారు. ఇన్నాళ్లూ తమ కళ్లెదుట తిరిగిన సోదరి.. ఇక నుంచి తమ ఇంట్లో ఉండదనే ఆలోచన వారిని ఎంతో బాధ పెడుతుంది. అలాంటి ఆడపిల్ల మరొకరి ఇంటికి వెళ్లిన తర్వాత ఎలాంటి ఇబ్బందులు పడకూడదని ప్రతి సోదరుడు కోరుకుంటాడు. ఒకవేళ తన సోదరికి ఏదైనా బాధ కలిగితే తండ్రికి కన్నా ముందు తానే పరిష్కరిస్తాడు. కానీ తమ అక్కనో.. చెల్లినో బావ వేధిస్తున్నాడని తెలిస్తే.. ఆ సోదరుడి గుండె తట్టుకోలేదు. ఆ సమస్య పరిష్కరించడానికి.. బావను దారిలోకి తేవడానికి అన్నిరకాలుగా ప్రయత్నిస్తారు. తమ సోదరి కాపురాన్ని నిలబెట్టడానికి కృషి చేస్తారు. కానీ మేడ్చల్ జిల్లా జీడిమెట్లలో తమ అక్కను ఎందుకు వేధిస్తున్నావని బావని అడగడానికి వెళ్లిన ఇద్దరు బావమరుదులు.. అతనితో మాటామాటా పెరిగి చివరకు అతణ్ని హత్య చేశారు.

అసలేం జరిగిందంటే..

Brothers Killed By Brother in Laws : జీడిమెట్ల భాగ్యలక్ష్మి కాలనీలో నివాసముండే వెంకటేశ్(28).. తన భార్య రేఖతో తరచూ గొడవ పడేవాడు. ఈ విషయం రేఖ తన పుట్టింటి వాళ్లకి చెప్పింది. తమ అక్కను బావ ఇబ్బంది పెడుతున్నాడని తెలిసి రేఖ సోదరులు వినయ్, మధులు అతనికి సర్దిచెప్పారు. ఎన్నిసార్లు చెప్పినా వారి అక్కను వేధిస్తూనే ఉన్నాడని వాళ్లు ఆవేదన చెందారు.

అడ్డొచ్చిన వాళ్లపైనా దాడి..

Man Was Killed in Jeedimetla : గురువారం రాత్రి వెంకటేశ్ సుభాశ్​నగర్‌లోని తన ఇంటికి వెళ్లాడు. ఈ విషయం తెలుసుకున్న వినయ్, మధులు.. అతడి వద్దకు వెళ్లి తమ అక్కను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారని గొడవ పడ్డారు. వీరి మధ్య మాటామాటా పెరిగి క్షణికావేశంలో బావమరుదులిద్దరు వెంకటేశ్‌పై కత్తులతో దాడికి దిగారు. గమనించిన వెంకటేశ్ అన్న పోతరాజు(35) వారిని అడ్డుకునే ప్రయత్నం చేయగా అతనిపై కూడా వినయ్, మధులు దాడి చేశారు. ఈ ఘటనలో పోతరాజు అక్కడికక్కడే మృతి చెందాడు. గొవడ ఆపడానికి వచ్చిన వెంకటేశ్ స్నేహితుడు కృష్ణ కూడా ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డాడు.

ఈ ఘర్షణ గమనించిన స్థానికులు తీవ్రంగా గాయపడిన వెంకటేశ్, కృష్ణలను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ వెంకటేశ్ మృతి చెందాడు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను గాంధీ ఆస్పత్రికి తరలించారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.