ETV Bharat / crime

అత్యాచారం.. ఆపై హత్య.. దొరకకుండా ఉండేందుకు యువతి ఫోన్​ నుంచే అలా..! - మైలార్దేవ్​ యువతి మర్డర్​ కేసు వీడింది

MailardevPalli murder case update: మైలార్​దేవ్​పల్లికి చెందిన యువతి హత్యాచార ఘటనలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్​కు తరలించిన పోలీసులు.. మరిన్ని ఆధారాలు సేకరిస్తున్నారు. కేసును తప్పుదోవ పట్టించేందుకు నిందితుడు యువతి చరవాణి నుంచి ఆమె తండ్రికి సందేశాలు పంపించినట్లు గుర్తించారు. నిందితులను కస్టడీలోకి తీసుకొని ప్రశ్నిస్తే మరింత సమాచారం వచ్చే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు.

మైలార్దేవ్​ యువతి మర్డర్​ కేసు వీడింది
మైలార్దేవ్​ యువతి మర్డర్​ కేసు వీడింది
author img

By

Published : Sep 11, 2022, 8:45 AM IST

Updated : Sep 11, 2022, 2:38 PM IST

MailardevPalli murder case update: ఈ నెల 5న మైలార్​దేవ్​పల్లిలో ఇంట్లో నుంచి వెళ్లిన యువతి హత్యాచారానికి గురైనట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. పోలీసులు కథనం ప్రకారం ప్రేమించిన యువకుడే పెళ్లి పేరుతో ఒత్తిడి చేయడం.. యువతి నిరాకరించడంతో చున్నీతో మెడకు ఉరి బిగించి హత్య చేసినట్లు గుర్తించారు. మైలార్​దేవ్​పల్లికి చెందిన యువతి డిగ్రీ చదువుతోంది. వనపర్తి జిల్లా ఖిల్లాఘనపూర్ మండలం మానాజీపేటకు చెందిన దూరపు బంధువు శ్రీశైలంతో స్నేహం ఏర్పడింది. ఏడాది క్రితం పెళ్లి ప్రస్తావన తీసుకురాగా యువతి తండ్రి నిరాకరించాడు.

చున్నీతో ఉరివేసి కాల్వలో పూడ్చి పెట్టాడు: శ్రీశైలం మాత్రం యువతిని పెళ్లి పేరుతో ఫోన్లో వేధించేవాడు. నచ్చజెప్పేందుకు యువతిని ఈ నెల 5న వనపర్తి జిల్లా మానాజీపేటకు తీసుకెళ్లాడు. మరోసారి పెళ్లి ప్రస్తావన తెచ్చి ఒత్తిడి చేశాడు. తనను మరిచిపోవాలని యువతి సూచించగా అత్యాచారం చేసిన శ్రీశైలం.. ఆవేశంలో ఆమె చున్నీని మెడకు బిగించి ఊపిరాడకుండా చేశాడు. మేనత్త కుమారుడు శివ సాయంతో సమీపంలోని కేఎల్ఐ కాల్వ పక్కనే మృతదేహాన్ని పూడ్చిపెట్టాడు.

యువతి ఫోన్​ నుంచే తండ్రికి సమాచారం: యువతి కాల్​డేటా ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులకు శ్రీశైలంపై అనుమానం వచ్చింది. విషయాన్ని తప్పుదోవ పట్టించేలా యువతి చరవాణి నుంచి ఆమె తండ్రికి సందేశం పంపించాడు. వేరొక యువకుడిని ప్రేమించానని.. అతనితో వెళ్తున్నట్లు సందేశంలో పేర్కొన్నాడు. మానాజీపేటకు వెళ్లిన పోలీసులు శ్రీశైలంను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారణ చేపట్టగా.. నేరం అంగీకరించాడు. యువతి మృతదేహాన్ని వెలికితీసి ఎమ్మార్వో సమక్షంలో పోస్టుమార్టం పూర్తిచేసి కుటుంబసభ్యులకు అప్పజెప్పారు.

ఇవీ చదవండి:

Last Updated : Sep 11, 2022, 2:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.