ETV Bharat / crime

పురుగుల మందు తాగి ప్రేమికుల జంట ఆత్మహత్యాయత్నం... ఎందుకంటే..? - గీసుకొండ తాజా వార్తలు

lovers suicide in warangal: ఇద్దరూ ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నారు. కలిసి బతకాలని ఎన్నో కలలు కన్నారు. కలిసి ఉంటే ఎంత సంతోషంగా గడుపుతామో అంటూ ఊసులు చెప్పుకున్నారు. గత వారమే అమ్మాయికి వివాహం జరగగా అదే విషయాన్ని అడుగుదామని యువతి ఇంటికి ప్రియుడు వెళ్లాడు. తర్వాత ఏం జరిగిందో కానీ కాసేపటికే ఇద్దరు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటన వరంగల్ జిల్లా గీసుకొండ మండలంలో చోటుచేసుకుంది.

lovers suicide
ప్రేమికుల జంట ఆత్మహత్యాయత్నం
author img

By

Published : Feb 26, 2022, 1:38 PM IST

lovers suicide in warangal: వరంగల్ జిల్లా గీసుకొండ మండలం కొమ్మాల దస్రుతండలో ప్రేమ జంట పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకుంది. ఈ ఘటనలో ప్రియుడు రాజేందర్ మృతిచెందగా, ప్రాణాపాయ స్థితిలో ఉన్న యువతి ప్రస్తుతం వరంగల్ ఎంజిఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.

lovers suicide
ప్రియుడి ఫోటో(రాజేందర్)

అసలేం జరిగిందంటే..

గీసుకొండ మండలం మంగల్‌తండాకు చెందిన అమ్మాయికి గత వారమే.. దస్రుతండాకు చెందిన ఓ యువకుడితో వివాహం జరిగింది. అయితే ఇద్దరి మధ్య గత కొంతకాలంగా ప్రేమ వ్యవహారం నడుస్తోంది. ఇదే విషయమై మాట్లాడేందుకు ప్రియుడు శుక్రవారం సాయంత్రం ప్రియురాలి ఇంటికి వచ్చిన కాసేపటికే ఈ ఘటన చోటు చేసుకుంది. అబ్బాయినే బలవంతంగా పురుగుల మందు తాగించాడని అమ్మాయి తరఫు బంధువులు చెబుతున్నారు. రాజేందర్ మృతదేహాన్ని నర్సంపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి: ప్రియుడితో ఉన్న భార్యను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న భర్త.. ఏం చేశాడంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.