ETV Bharat / crime

Lovers suicide attempt: పెద్దలు ఒప్పుకోలేదని.. ప్రేమజంట ఆత్మహత్యాయత్నం - గొంతు కోసుకుని ఆత్మహత్య

తమ ప్రేమను పెద్దలు ఒప్పుకోవటం లేదని మనస్తాపం చెందిన ఓ ప్రేమ జంట ఆత్మహత్యకు యత్నించింది. ఈ ఘటన నిజామాబాద్​ జిల్లా డిచ్​పల్లి శివారులో చోటుచేసుకుంది. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో జిల్లా ఆస్పత్రికి తరలించి.. చికిత్స అందిస్తున్నారు.

lovers attempted suicide at dichpally
lovers attempted suicide at dichpally
author img

By

Published : Sep 7, 2021, 6:58 PM IST

నిజామాబాద్ జిల్లాలో ఓ ప్రేమ జంట గొంతు కోసుకుని ఆత్మహత్యకు యత్నించింది. నిజామాబాద్​లోని గౌతమ్​నగర్​కి చెందిన ప్రశాంత్ ఓ ప్రైవేట్​ ఇంజినీరింగ్​ కళాశాలలో అధ్యాపకుడిగా పని చేస్తున్నాడు. బాన్సువాడ మండలం నెమిలి గ్రామానికి చెందిన జ్యోతి ప్రస్తుతం డిగ్రీ చదువుతోంది. ఇద్దరూ గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరి విషయం ఇళ్లలో తెలియగా.. వివాహానికి ఒప్పుకోలేదు. పెళ్లితో ఒక్కటవ్వాలనుకున్న వారికి పెద్దలు అడ్డు చెప్పటం వల్ల తీవ్ర మనస్తాపం చెందిన ప్రేమికులు.. చావులోనైనా ఒక్కటవ్వాలనుకున్నారు.

డిచ్​పల్లి శివారులోని ఎల్లమ్మ గుడికి చేరుకున్న ఇద్దరు.. బ్లేడ్​తో గొంతు కోసుకున్నారు. రక్తం కారుతూ.. గిలిగిలలాడుతున్న ప్రేమ జంటను గమనించిన స్థానికులు ఇద్దరిని ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పెద్దలు ఒప్పుకోకపోతే.. వారి సమ్మతం కోసం ఓపికగా వేచి చూడాలే తప్పా.. ఇలా విలువైన జీవితాలను అర్ధాంతరంగా ముగించే ప్రయత్నాలు చేయటం మూర్ఖత్వమని పలువురు హెచ్చరిస్తున్నారు. తమపైనే ఎన్నో ఆశలు పెట్టుకున్న ఇరు కుటుంబాలకు దుఃఖం మిగిల్చి.. తమను తాము బలి చేసుకోవటం ప్రేమికుల లక్షణం కాదని చెబుతున్నారు.

ఇదీ చూడండి:

Rain Effect: చేపలకు బదులు కోళ్లు కొట్టుకొచ్చాయి.. ఆ గ్రామస్థులకు పండగే పండగ...

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.