ETV Bharat / crime

ప్రియురాలు, ఆమె తల్లిని కత్తితో పొడిచిన ప్రేమోన్మాది.. అసలేం జరిగిందంటే? - atrocious incident in miyapur

Miyapur Incident: హైదరాబాద్‌ శివారు మియాపూర్‌లో ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడడం సంచలనం రేపింది. ప్రేమించిన యువతి, ఆమె తల్లిపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. అనంతరం అతను కూడా కత్తితో గొంతుకోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటనలో ముగ్గురిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు. యువతి తల్లి, నిందితుడి పరిస్థితి విషమంగా ఉంది.

Miyapur incident
Miyapur incident
author img

By

Published : Dec 13, 2022, 8:10 PM IST

Updated : Dec 13, 2022, 8:52 PM IST

ప్రియురాలు, ఆమె తల్లిని కత్తితో పొడిచిన ప్రేమోన్మాది.. అసలేం జరిగిందంటే?

Miyapur Incident: ప్రేమించిన యువతి దూరం పెట్టిందనే కక్షతో ప్రేమోన్మాది చెలరేగిపోయాడు. కత్తితో యువతి, ఆమె తల్లిపై దాడి చేశాడు. తానూ గొంతు కోసుకుని ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. హైదరాబాద్‌ మియాపూర్‌లోని ఓ కాలనీలో జరిగిన ఈ ఘటన కలకలం సృష్టించింది. ఏపీలోని గుంటూరు జిల్లాకు చెందిన యువతి, ఆమె తల్లి.. సోదరుడితో కలిసి 8నెలల కిందట హైదరాబాద్‌కు వలస వచ్చారు.

గుంటూరులో ఉంటున్న సమయంలో యువతికి రేపల్లెకు చెందిన సందీప్‌తో పరిచయం ఏర్పడింది. మూడు సంవత్సరాలుగా వీరిద్దరూ ప్రేమించుకున్నారు. వీరికి నిశ్చితార్ధం కూడా జరిగిందని పోలీసులు తెలిపారు. మనస్పర్థలు రావడంతో కొద్దికాలంగా యువతి.. సందీప్‌ను దూరం పెడుతూ వచ్చింది. అతనితో మాట్లాడడం మానేసింది. సందీప్‌ తరచూ యువతికి ఫోన్‌ చేయడంతోపాటు.. వాట్సాప్‌ సందేశాలు పంపుతూ బెదిరించేవాడని పోలీసులు తెలిపారు.

రేపల్లె నుంచి మియాపూర్‌కు వచ్చిన సందీప్‌: రేపల్లె నుంచి మియాపూర్‌కు వచ్చిన సందీప్‌ తన వెంట తెచ్చుకున్న కత్తితో యువతి ఇంటికి వెళ్లాడు. ఆమె తల్లితో ఘర్షణకు దిగాడు. ఇద్దరి మధ్య మాటా మాటా పెరగడంతో.. సందీప్‌ కత్తితో ఆమెపై దాడి చేశాడు. ఇదే క్రమంలో అడ్డువచ్చిన యువతిపైనా దాడి చేసి.. అనంతరం కత్తితో గొంతు కోసుకుని అపస్మారక స్థితికి చేరుకున్నాడు. బాధితులు కేకలు వేయడంతో స్థానికులు అక్కడకు చేరుకుని పోలీసులకు సమాచారం అందించారు.

చికిత్స నిమిత్తం వారిని తొలుత ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి గాంధీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. యువతి తల్లి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. నిందితుడు సందీప్‌కు తీవ్రగాయాలయ్యాయి. ప్రేమోన్మాది కత్తి దాడి స్థానికులను భయభ్రాంతులకు గురిచేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు. నిందితుడు సందీప్‌ కోలుకున్నాక పోలీసులు అరెస్ట్ చేయనున్నారు.

"వారిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకున్నారు. నిశ్చితార్థం కూడా జరిగింది. ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో యువతి అతడిని దూరంగా పెడుతూ వస్తోంది. ఇరువురు పెద్దల సమక్షంలో విడిపోయారు. రేపల్లె నుంచి మియాపూర్‌కు వచ్చిన సందీప్‌ తన వెంట తెచ్చుకున్న కత్తితో యువతి ఇంటికి వెళ్లాడు. ఆమె తల్లితో ఘర్షణకు దిగాడు. ఇద్దరి మధ్య మాటా మాటా పెరగడంతో సందీప్‌ కత్తితో యువతి తల్లిపై దాడి చేశాడు. ఇదే క్రమంలో అడ్డువచ్చిన యువతిపైనా దాడి చేసి.. అనంతరం కత్తితో తాను గొంతు కోసుకున్నాడు. " - శిల్పవల్లి, మాదాపూర్ డీసీపీ

ఇవీ చదవండి: పరిచయం.. ప్రేమ.. కిడ్నాప్​.. రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు

కొడవలితో నరికి ఐదుగురు కుటుంబ సభ్యుల హత్య.. ఆపై ఉరేసుకున్న కూలీ

Last Updated : Dec 13, 2022, 8:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.