లారీ, ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో భార్య అక్కడికక్కడే మృతి చెందగా... భర్తకు తీవ్ర గాయాలైన ఘటన రంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. చంగోముల్ గ్రామానికి చెందిన సత్యనారాయణ గౌడ్, స్వాతి(35) బైక్పై వెళుతున్నారు. చేవెళ్ల మండలం మల్కాపూర్ గేట్ సమీపంలో వారికి ఎదురుగా వస్తున్న లారీ, ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో స్వాతి అక్కడికక్కడే మృతి చెందగా... సత్యనారాయణకు తీవ్ర గాయాలయ్యాయని చేవెళ్ల పోలీసులు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
ఇదీ చదవండి: అక్కడ కరోనా కేసుల పెరుగుదల.. రాష్ట్ర వైద్యారోగ్య శాఖ అప్రమత్తం