ETV Bharat / crime

రోడ్డుపై మాట్లాడుతుండగా... ఇసుక లారీ ఢీకొని ఇద్దరి మృతి - లారీ ఢీకొని ఇద్దరి మృతి

రోడ్డుపై నిలబడి మాట్లాడుకుంటున్న వారు అనుకోలేదు తమను మృత్యువు కబలిస్తోందని. రహదారి పక్కనే నిల్చొని మాట్లాడుకుంటున్నవారిని ఇసుక లారీ ఢీకొట్టిన ఘటన మంథనిలో చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు.

Two Members Died In Accident
లారీ ఢీకొని ఇద్దరి మృతి
author img

By

Published : Nov 15, 2021, 8:44 AM IST

పెద్దపల్లి జిల్లా మంథని మండలంలో ఆదివారం ఉదయం లారీ అదుపుతప్పి ఢీకొనడంతో ఇద్దరు మృతి (Two Members Died In Accident) చెందారు. మంథని నుంచి ఖమ్మంపల్లి వెళ్లే రహదారిలో బిట్టుపల్లి సమీపంలో రహదారి పక్కన నిలబడి ఉన్న సిరివేరి గట్టయ్య(65), దర్గుల రాయమల్లు(55) మాట్లాడుకుంటున్నారు. అదే సమయంలో మంథని నుంచి అతివేగంగా వస్తున్న లారీ మూల మలుపు వద్ద అదుపుతప్పి… గట్టయ్య, రామమల్లును (Two Members Died In Accident) ఢీకొంది.

ఈ ఘటనలో గట్టయ్య అక్కడికక్కడే ప్రాణాలు (Two Members Died In Accident) విడిచారు. రాయమల్లును ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందారు. మృతులు బిట్టుపల్లివాసులుగా గుర్తించారు. ఈ ఘటన నేపథ్యంలో బిట్టుపల్లి గ్రామస్థులు రహదారిపై వాహనాలను అడ్డుకొని ఆందోళన నిర్వహించారు. మంథని నుంచి ఖమ్మంపల్లి ఇసుక క్వారీకి వెళ్లే లారీల అతివేగం కారణంగా ప్రమాదాలు జరుగుతున్నాయని ఆరోపించారు. వాటిని నిలిపివేయాలని రహదారిపై ధర్నా చేశారు. గ్రామస్థుల ఆందోళనతో మంథని-ఖమ్మంపల్లి ప్రధాన రహదారిలో నాలుగు గంటలపాటు రాకపోకలు స్తంభించాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందిపడ్డారు. గోదావరిఖని ఏసీపీ గిరిజాప్రసాద్‌, మంథని సీఐ సతీష్‌లు అక్కడికి చేెరుకొని బాధితుల (Two Members Died In Accident)కు న్యాయం చేస్తామని హమీ ఇచ్చారు. దీంతో గ్రామస్థులు ఆందోళన విరమింపజేశారు. బాధిత కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

ఇదీ చూడండి: Bike Accident: రెండు ద్విచక్రవాహనాలు ఢీ.. నలుగురు మృతి..

బైక్​ను తప్పించబోయి ప్రమాదం.. 13 మందికి తీవ్ర గాయాలు

3 రోజుల నుంచి తమ్ముడు కలవలేదని ఇంట్లోకి వెళ్లి చూస్తే.. అన్న షాక్..!​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.