Lorry Caught fire on the road : హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై లారీలో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. హయత్నగర్ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న లారీలో మంటలు రావడంతో అప్రమత్తమైన డ్రైవర్ వెంటనే వాహనంలో నుంచి దిగిపోయాడు. లారీ క్యాబిన్ పూర్తిగా దగ్ధమైంది. రహదారిపై ఈ ఘటన చోటుచేసుకోవడంతో వాహనదారులు భయాందోళనకు గురయ్యారు.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపు చేశారు. ఈ ఘటనతో ఆ రహదారిపై కొద్దిసేపు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. రంగంలోకి దిగిన ట్రాఫిక్ పోలీసు అధికారులు ట్రాఫిక్ సమస్యను నియంత్రించారు.