ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం గుబ్బగుర్తి వద్ద లారీ, ఆటో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ రామయ్య మృతి చెందారు. ఏన్కూరు వైపు నుంచి వెళ్తున్న లారీ గుబ్బగుర్తి వద్ద అదుపు తప్పి ఆటోని ఢీకొని బోల్తా పడింది. అనంతరం లారీలో మంటలు వ్యాపించాయి.
అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపు చేశారు. లారీ డ్రైవర్ వెంటనే బయటకు రావడంతో ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటనతో గుబ్బగుర్తి వద్ద గంటకుపైగా వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.
ఇదీ చదవండి: చెరువులో దూకి విద్యార్థి ఆత్మహత్య!