ETV Bharat / crime

అదుపుతప్పి లారీ బోల్తా.. రహదారిపై భారీ గ్రానైట్ రాళ్లు! - తెలంగాణ వార్తలు

మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి శివారులో ప్రధాన రహదారిపై గ్రానైట్ రాళ్లను తరలించే లారీ అదుపుతప్పి బోల్తా పడింది. లారీలోని గ్రానైట్ రాళ్లు రహదారిపై పడిపోయాయి. ఈ సంఘటనతో ఇరువైపులా రాకపోకలు నిలిచిపోయాయి.

lorry accident in danthalapally, granite stones lorry accident
గ్రానైట్ రాళ్లతో ఉన్ లారీ బోల్తా, లారీ ప్రమాదం
author img

By

Published : May 16, 2021, 10:02 AM IST

మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి శివారులో వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై ప్రమాదవశాత్తు గ్రానైట్ రాళ్లు పడిపోయాయి. కేసముద్రంలోని ఓ క్వారీ నుంచి ఆంధ్రప్రదేశ్​లోని శ్రీకాకుళానికి వెళ్తున్న భారీ గ్రానైట్ రాళ్ల లారీ అదుపుతప్పి బోల్తా పడింది. మేకల మంద అడ్డు రావడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు.

మూడు గ్రానైట్ భారీ రాళ్లు ఒక్కసారిగా కుదుపునకు గురై ముందుకు దూసుకొచ్చాయి. క్యాబిన్​ను తాకగా... పూర్తిగా ధ్వంసమైంది. ఈ సంఘటనతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. జేసీబీల సాయంతో రహదారిపై పడిన రాళ్లను, లారీని తొలగించారు. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్, క్లీనర్లకు స్వల్ప గాయాలయ్యాయి.

ఇదీ చదవండి: పెళ్లి కోసం దాచిన డబ్బు, 45 తులాల బంగారం చోరీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.