నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండల కేంద్రంలోని రైల్వే గేటు వద్ద ఓ వ్యక్తి రైలు పట్టాలపై పడుకొని ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. త్రియంబక్ పేట గ్రామానికి చెందిన అశోక్(48) అనారోగ్యం, కుటుంబ కలహాల కారణంగా.. ఆత్మహత్య చేసుకోవాలనే ఉద్దేశంతో ఇందల్వాయిలోని రైల్వే స్యేషన్కు చేరుకున్నాడు. రైలు వస్తున్న సంగతి గమనించి.. గేటు సమీపంలోని పట్టాలపై పడుకున్నాడు. రైలు సమీపానికి రాగానే భయంతో చేతులు, తల లోపలికి తీసుకున్నాడు. ఇంజిన్ ముందు చిట్కాలు అశోక్ కాలు పైనుంచి వెళ్లడంతో గాయాలపాలయ్యాడు.
వ్యక్తి పట్టాలపై పడి ఉండడాన్ని గమనించిన లోకోపైలెట్ అత్యవసరంగా రైలును నిలిపివేశారు. పైలెట్ జాగ్రత్తతోనే అశోక్ ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారని స్థానికులు వెల్లడించారు. రైలు నిలిచిపోవడం వల్ల పట్టాలపై నుంచి అశోక్‌ని బయటకు తీసి స్థానిక ఆస్పత్రికి తరలించారు. అశోక్ తలకి, కాలుకి గాయాలైనట్లు ఆస్పత్రి సిబ్బంది తెలిపారు.
ఇదీ చదవండి: 18 రోజుల్లో 4 శాతానికి పైగా దిగువకు కరోనా కేసులు