జంతు కళేబరాలను గుట్టు చప్పుడు కాకుండా తరలిస్తోన్న ఓ లారీని స్థానికులు పట్టుకున్నారు. వికారాబాద్ జిల్లా పరిగి మండలం గోవిందాపూర్‌లో ఇది జరిగింది. పశువుల ఎముకలను.. కల్తీ నూనె తయారు చేసేందుకు తీసుకెళ్తున్నారని స్థానికులు ఆరోపించారు.
అనుమతితోనే.. కళేబరాలను శంషాబాద్‌లోని ఓ బోన్స్ ఫ్యాక్టరీకి తరలిస్తున్నట్లు లారీ డైవర్ తెలిపాడు. వాహనానికి ముందు ఒక నంబర్.. వెనకాల మరో నంబర్ ఉండటం అనుమానాలకు తావిస్తోంది.
ఇదీ చదవండి: బాలుడి ప్రాణం తీసిన బోర్వెల్ నిర్వాహకుల నిర్లక్ష్యం