ETV Bharat / crime

నకిలీ పాసు పుస్తకాలతో రుణాలు...12 మంది అరెస్టు - telangana varthalu

నకిలీ పాసు పుస్తకాలతో రుణాలు పొందిన కేసులో 12 మందిని పోలీసులు అరెస్టు చేశారు. సూత్రధారి పందుల ప్రభాకర్​తో పాటు మరో 11 మందిని అదుపులోకి తీసుకున్నామని రామగుండం సీపీ సత్యనారాయణ తెలిపారు. ఐదుగురు పరారీలో ఉన్నారు.

నకిలీ పాసు పుస్తకాలతో రుణాలు...12 మంది అరెస్టు

author img

By

Published : Mar 19, 2021, 6:05 PM IST

Updated : Mar 19, 2021, 7:18 PM IST

పెద్దపల్లి జిల్లా రామగిరి, ముత్తారం మండలాల్లో నకిలీ పాసుపుస్తకాలను సృష్టించి బ్యాంక్ రుణాలు ఇప్పించిన 12మంది ముఠా సభ్యులను రామగుండం పోలీస్ కమిషనర్ సత్యనారాయణ అరెస్ట్ చేశారు. వారి నుంచి 5లక్షల 55 వేల నగదు, నకిలీ పాసుపుస్తకాలు, రబ్బరు స్టాంపులతో పాటు పహాని పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. సీపీ సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. 2016-18 సంవత్సరాల మధ్య 153 మంది రైతులు పట్టాదారు పాసు పుస్తకాలతో తెలంగాణ గ్రామీణ బ్యాంక్​లో కోటి 99లక్షల 89 వేల రూపాయల రుణం తీసుకున్నారు. సంవత్సర కాలం గడిచిన రుణాలు చెల్లించకపోవడంతో అనుమానం వచ్చిన బ్యాంక్ మేనేజర్ రికార్డులను పరిశీలించగా నకిలీ పాసుపుస్తకాలని తేలింది.

153 మంది రైతులపై రామగిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీపీ సత్యనారాయణ ఆదేశాల మేరకు విచారణ చేపట్టిన పోలీసులు అసలు సూత్రధారి అయిన పందుల ప్రభాకర్​తో పాటు మరో 11 మందిని అదుపులోకి తీసుకున్నామన్నారు. వీరితో పాటు మరో ఐదుగురు నిందితులు పరారీలో ఉన్నారని.. అందులో ఇద్దరు బ్యాంక్ మేనేజర్లు, ఒక వీఆర్వో ఉన్నారని, త్వరలో వారిని కూడా అరెస్ట్ చేస్తామన్నారు. రుణాలు తీసుకున్న రైతులను బాధితులుగా, సాక్షులుగా పరిగణించి కేసు విచారణ చేపట్టామన్నారు. నకిలీ పాసుపుస్తకాలు ఎక్కడి నుంచి తెచ్చారు, దీనికి ఎవరెవరు సహకరించారు?.. అనే కోణంలో ఆరా తీస్తున్నామని సీపీ సత్యనారాయణ తెలిపారు.

నకిలీ పాసు పుస్తకాలతో రుణాలు...12 మంది అరెస్టు

ఇదీ చదవండి: నకిలీ పాస్​పుస్తకాలతో బ్యాంకుకు టోకరా

Last Updated : Mar 19, 2021, 7:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.