ETV Bharat / crime

మైనర్​ బాలికపై అత్యాచారం.. నిందితుడికి జీవిత ఖైదు - హైదరాబాద్ తాజా వార్తలు

మైనర్ బాలికపై అత్యాచారం కేసులో నిందితుడికి ఎల్బీనగర్​ కోర్టు జీవిత ఖైదు విధించింది. బోయిన్ పల్లిలో లిఫ్ట్ ఆపరేటర్​గా విధులు నిర్వహిస్తున్న తిరుపతి అనే వ్యక్తి తమ కుమార్తెపై లైంగిక దాడికి పాల్పడినట్లు... బాలిక తండ్రి 2016లో జవహర్​నగర్ పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. ఈ కేసులో విచారణ చేపట్టిన కోర్టు తాజాగా నిందితుడికి శిక్షను ఖరారు చేసింది.

lb nagar court has sentenced the accused to life imprisonment in a case of rape of a minor girl
అత్యాచారం కేసులో జీవిత ఖైదు పడిన వ్యక్తి
author img

By

Published : Apr 17, 2021, 2:56 AM IST

మైనర్​ బాలికపై అత్యాచారం కేసులో నిందితుడికి ఎల్బీనగర్​ కోర్టు జీవిత ఖైదు విధిస్తూ తీర్పు వెల్లడించింది. బోయిన్​పల్లిలో లిఫ్ట్ ఆపరేటర్​గా విధులు నిర్వహిస్తున్న తిరుపతి అనే వ్యక్తి మైనర్ బాలికను కిడ్నాప్ చేసినట్లు ఆమె తండ్రి సికింద్రాబాద్​ జవహర్​నగర్​ పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేశాడు. బాలికను బలవంతంగా వివాహం చేసుకుని తమ బంధువుల ఇంట్లో ఉంచాడని.. అనంతరం ఆరు నెలల పాటు ఆమెపై లైంగిక దాడికి పాల్పడినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.

బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు... అతనిపై అపహరణ, అత్యాచారం కింద కేసు నమోదు చేసి జవహర్ నగర్ పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో విచారణ చేపట్టిన ఎల్బీనగర్ కోర్టు అతనికి జీవిత ఖైదు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది.

ఇదీ చదవండి: 'వైరస్‌ను తేలికగా తీసుకోవడమే అత్యంత ప్రమాదకరం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.