ETV Bharat / crime

న్యాయవాదుల హత్యకు కారణమేంటి? అసలేం జరిగింది? - న్యాయవాద దంపతుల దారుణ హత్య

పెద్దపల్లిలో జరిగిన న్యాయవాద దంపతుల దారుణ హత్య రాష్ట్రంలో తీవ్ర అలజడి రేపుతోంది. పట్టపగలు, నడిరోడ్డుపై అంతా చూస్తుండగానే... గట్టు వామన్ రావు, నాగమణి దంపతులను కత్తులతో నరికి చంపడంపై తీవ్ర విమర్శలు, ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రాణహాని ఉందని వామన్‌రావు, నాగమణి పలుమార్లు హైకోర్టులో నివేదించినా ఫలితం లేకపోయింది.

Lawyer vamana rao couple murder mystery
Lawyer vamana rao couple murder mystery
author img

By

Published : Feb 18, 2021, 4:15 AM IST

Updated : Feb 18, 2021, 9:29 AM IST

పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కల్వచర్ల వద్ద గుర్తుతెలియని వ్యక్తులు..... న్యాయవాద దంపతులు వామన్‌రావు, నాగమణిలను దారుణంగా హత్య చేయడంపై ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటన వెనక ఎవరి హస్తం ఉందన్నది స్పష్టంగా తెలియకపోయినా... పలువురి పేర్లు మాత్రం ప్రముఖంగా వినిపిస్తున్నాయి. పోలీసులు, అధికారులకు వ్యతిరేకంగా కోర్టుల్లో వామన్‌రావు, నాగమణి దంపతులు అనేక పిటిషన్లు దాఖలుచేయడం సహా పలువురు పిటిషనర్ల తరఫున వాదనలు వినిపించేవారు.

రక్షణకల్పించాలంటూ పిటిషన్...

గతేడాది మే 22న మంథని ఠాణాలో శీలం రంగయ్య అనుమానాస్పదమృతిపై నాగమణి హైకోర్టుకు లేఖరాయగా హైదరాబాద్ పోలీసు కమిషనర్ అంజనీకుమార్‌తో కోర్టు విచారణ జరిపించింది. ఆ నివేదికలో రంగయ్యది ఆత్మహత్యేనని పేర్కొనడంపై నాగమణి అభ్యంతరం వ్యక్తం చేయడంతోపాటు అఫిడవిట్ దాఖలు చేస్తానని చెప్పారు. పోలీసుల నుంచి బెదిరింపులు వస్తున్నాయని ప్రాణాలకు రక్షణకల్పించాలంటూ పిటిషన్ దాఖలు చేసిన ఆమె... రామగుండం పోలీసులపై సీబీఐ విచారణ జరిపించాలని కోరారు. కమిషనర్ సత్యనారాయణ సహా పలువురు పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని... కేసు విచారణ పూర్తయ్యేవరకు బదిలీ చేయాలని కోరారు.

ఠాణాలకు పిలవొద్దని హైకోర్టు ఉత్తర్వులు...

పోలీసులకు భయపడి వాంగ్మూలం ఇచ్చేందుకు ఎవరూ ముందుకు రావట్లేదంటూ గత డిసెంబరులో పిటిషన్‌ వేశారు. వామన్‌రావు దంపతులను పోలీస్‌స్టేషన్లకు పిలవొద్దని అప్పట్లో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. ఇటీవల ఆ ఉత్తర్వులను తొలగించాలన్న ఏజీ అభ్యర్థనను తిరస్కరించింది. రామగుండం కమిషనరేట్ పరిధిలో తమపై తప్పుడు కేసులు పెట్టి విచారణ పేరుతో హైదరాబాద్‌లో ఉన్న తమను పిలిచి వేధిస్తున్నారని నాగమణి కోర్టుకు నివేదించడంతో మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేయడానికి హైకోర్టు నిరాకరించింది.

తెరాస నేత పుట్ట మధు కేసులో కీలకపాత్ర...

గతంలో తెరాస నేత పుట్ట మధు అక్రమార్జనకు పాల్పడ్డారంటూ దాఖలైన పిటిషన్లలోనూ వామన్‌రావు దంపతులు కీలకపాత్ర పోషించారని తెలిసింది. మధు సతీమణి శైలజ స్థానిక ఎన్నికల్లో తప్పుడు అఫిడవిట్ దాఖలుచేశారంటూ దాఖలైన పిటిషన్లు, బాచుపల్లి సీఐ, ఎస్సైలపై దాఖలైన మరో పిటిషన్‌లోనూ న్యాయవాదిగా వాదనలు వినిపించారు. అన్నారం బ్యారేజీ ముంపు ప్రాంతంలో వెంకటాపురంలో ఇసుక క్వారీయింగ్‌కు అనుమతిపై నాగమణి హైకోర్టుకు లేఖ రాశారు. తక్కువ ధరకే కేటాయించారని తద్వారా పంచాయతీకి 49 కోట్ల మేర నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. వీటితోపాటు భూ సేకరణను సవాలు చేస్తూ దాఖలైన పలు పిటిషన్లలో వీరు న్యాయవాదులుగా ఉన్నారు.

ఎంతటివారైనా శిక్షిస్తాం...

న్యాయవాద దంపతుల హత్య కేసులో నిందితుల్ని త్వరలోనే పట్టుకుంటామని రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ తెలిపారు. నిందితుల్ని ఇప్పటికే గుర్తించామన్నారు. ఈ కేసుపై డీజీపీ మహేందర్‌ రెడ్డితో మాట్లాడి త్వరగా కొలిక్కి తీసుకురావాలని ఆదేశించినట్లు వెల్లడించారు. హత్య చేసిన దుండగులు ఎంతటి వారైనా కఠినంగా శిక్షిస్తామని రామగుండం పోలీస్‌ కమిషనర్‌ సత్యనారాయణ పేర్కొన్నారు. ఏ కారణాలతో హత్య చేశారనే విషయాలపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

న్యాయవాదులిద్దరికి సొంతగ్రామమైన గుంజపడుగులో ఒక దేవాలయం విషయంలో కొందరితో ఇటీవల గొడవ జరిగినట్లు తమ దృష్టికి వచ్చిందని పోలీసులు తెలిపారు. హత్యకు సంబంధించి అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నట్లు వివరించారు.

ఇదీ చూడండి: పట్టపగలు న్యాయవాద దంపతుల దారుణ హత్య

Last Updated : Feb 18, 2021, 9:29 AM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.